నేను ఎక్కువ మాట్లాడుతున్నా...నాగార్జున
"నేను ఏ సినిమాకీ ఎక్కువ మాట్లాడను. కానీ ఈ సినిమా గురించి మాత్రం ఎక్కువ మాట్లాడుతున్నాను. దానికి కారణం ఈ సినిమా నాకెప్పటికీ స్పెషల్‌గా మిగిలిపోతుంది. అంత ఇష్టపడి చేశాను. నేనొక సినిమాని బాగా ఇష్టపడితే అది కచ్చితంగా హిట్ అవుతుంది. సో..'గగనం' కచ్చితంగా హిట్ అని నమ్మకంగా చెబుతున్నాను' అని నాగార్జున అన్నారు. 'ఆకాశమంత' ఫేం రాధామోహన్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి 'గగనం' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నాగార్జున, ప్రకాష్‌రాజ్, పూనమ్ కౌర్ తదితరుల కాంబినేషన్‌లో తమిళ్, తెలుగు భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఇక ముందుగా మూడు టైటిల్స్ ని ప్రకటించి ఈ చిత్రానికి గగనం అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. అలాగే ఈ చిత్రం విజయదశమికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని దిల్ రాజు చెప్పారు.


Click it and Unblock the Notifications











