'రగడ' హాయిగా నిద్రపట్టేలా చేసింది...నాగార్జున
'రగడ'ను రాత్రి చూశాను. చిన్నపిల్లాడు నిద్రపోయినట్టు నిద్రపోయాను. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకంతో అంత నిద్రపట్టింది అని నాగార్జున అన్నారు అంటున్నారు. ఆయన తాజా చిత్రం 'రగడ' ఈ రోజు విడుదల అవుతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అలాగే...ఈ చిత్రంలో ఫైట్లు చాలా బాగా ఉంటాయి. సర్వేష్ మురారి నన్ను యంగ్‌గా చూపించారు. వీరుపోట్లకి నేనంటే చాలా ఇష్టం. నన్ను తెరమీద ఎలా చూపించాలనుకున్నాడో పాత్రను అలా తీర్చిదిద్దాడు. నిజజీవితంలో వ్యక్తులు నెమ్మదిగా ఉంటే అందరికీ ఇష్టం. కానీ తెరమీద కాస్త రూడ్‌గా ఉంటేనే ఇష్టపడుతారు. రామారావుగారి నుంచి అంతే. ఈ సినిమాలో రాయలసీమ యాసలో మాట్లాడతాను. ఆ యాసలోనే పొగరు ధ్వనిస్తుంది" అంటూ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











