పాపం సునీల్...6 ప్యాక్ బాడీపై నాగార్జున కామెంట్

By Bojja Kumar

హైదరాబాద్: అక్కినేని నాగార్జున తన తాజా సినిమా 'డమరుకం' చిత్రంలో సిక్స్ ప్యాక్‌ బాడీతో కనిపింబోతున్నట్లు ఆ చిత్రానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నాగార్జున తన సిక్స్ ప్యాక్ బాడీ గురించి మీడియాకు వివరించారు.

''అవసరం లేకున్నా షర్టు విప్పి చూపించడం నాకు ఇష్టం ఉండదు. సినిమాలో అవసరం ఉంది కాబట్టే సిక్స్ ప్యాక్ బాడీ పెంచాను. సిక్స్ ప్యాక్ చేయాలంటే వ్యాయామంతో పాటు డైట్ మెయింటెనెన్స్ చాలా ముఖ్యం, పాపం సునీల్ ఎంత కష్టపడ్డాడో అంటూ నాగార్జున వ్యాఖ్యానించారు.

రాజన్న, డమరుకం సినిమా షూటింగ్ దాదాపు ఒకే సమయంలో జరిగింది. రాజన్న సినిమా కోసం బాగా ఎక్సర్ సైజ్ చేసి బాడీ పెంచాల్సి వచ్చింది. అదే సమయంలో డమరుకం షూటింగ్ ఉండటంతో నెల రోజులు కష్టపడి సిక్స్ ప్యాక్ బాడీ పెంచాను. వాస్తవానికి శ్రీరామదాసు చిత్రం సమయంలో కూడా నా బాడీపై సిక్స్ ప్యాక్ చాయలు కొద్దిగా ఉండేవి. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారిలో ఇది కామనే. అప్పుడు అవసరం లేదు కాబట్టి మేకప్ వేసి కవర్ చేయాల్సి వచ్చింది''.. అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు. సిక్స్ ప్యాక్ చేసే వాళ్లు సమయానికి కడుపు నిండా తినకు. ఫలితంగా వాళ్ల మూడ్ కూడా బాగుండదు. ఎప్పుడూ కోపంగా ఉంటారు. అందుకే నాకు ఇలాంటి ఇష్టం ఉండదు. సినిమా కోసం తప్పదు కాబట్టి చేసారు అన్నారు.

డమరుకం చిత్రం చాలా బాగా వచ్చిందని, ఈ చిత్రం కొత్త కాన్సెప్టుతో వస్తోంది...... కొన్నిచోట్ల వార్తలు వినిపిస్తున్నట్లు 'డమరుకం' చిత్రం ఏ చిత్రానికి పోలిక ఉండదని నాగార్జున స్పష్టం చేసారు. దర్శకుడు శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి అందరు టెక్నీషియన్స్ ఎంతో కష్టపడి పని చేసారు. సినిమాలో లాస్ట్ 35 నిమిషాలు గ్రాఫిక్స్ హాలీవుడ్ సినిమాల రేంజిలో ఉంటాయి. కేలం గ్రాఫిక్స్ వల్లనే సినిమా ఆడుతుందని నేను అనను. కథకు తగిన విధంగా గ్రాఫిక్స్ చాలా భాగా సూటయ్యాయి. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని అన్నారు నాగార్జున.

నాగార్జున, అనుష్క, ప్రకాష్‌ రాజ్, గణేష్‌ వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణ్భగవాన్, జీవా, బ్రహ్మాజీ, అవినాష్, దేవన్, గిరిబాబు, రామరాజు, దువ్వాసి మోహన్, ప్రగతి, రజిత, కవిత, గీతాంజలి, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కథ: వెలిగొండ శ్రీనివాస్, సమర్పణ: కె.అచ్చిరెడ్డి, సహ నిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X