నాగార్జున రక్షించేవాడా?భక్షించేవాడా?
'ఆకాశమంతా" చిత్రం రాధా మోహన్ దర్వకత్వంలో నాగార్జున 'పయనం" చిత్రంలో నటించనున్నాడు. ఈ సినిమా కథ చాలా వరకు ట్రైన్ జర్నీగా సాగుతుందన్న వార్తలు వచ్చాయి. అయితే 'పయనం" తన పయనాన్ని మార్చుకుని ఫైట్ జర్నీని ఆశ్రయించింది. తాలిబన్లు ఫైట్ ను హైజాక్ చేసి కాందహార్ వైపు మళ్లించిన ఉదంతాన్ని దర్శకుడు స్ఫూర్తిగా తీసుకుని తన 'పయనం" కొనసాగిస్తున్నాడు.
ఎక్కువ భాగం షూటింగ్ విమానాశ్రయంలో నడవనుంది. కానీ అనుమతి రాకపోవడంతో ఎయిర్ పోర్ట్ సెట్ వేస్తున్నారు. సినిమా నిర్మాణ వ్యయంలో 25 శాతం ఈ గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్ కే ఖర్చవుతుందట! ముష్కరుల నుంచి ప్రయాణికులను రక్షించే హీరోగా నాగ్ నటిస్తున్నాడన్న మాట! ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న చిత్రం 'కేడి' కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని కథానాయకుడు నాగార్జున అన్నారు. చాలా సరదాగా మొదలైన కథ ఆ తర్వాత సీరియస్‌గా ఎలా మారిందన్నది చూసి తీరాల్సిన అంశమని ఆయన పేర్కొన్నారు. నాగార్జునతో కామాక్షి కళా మూవీస్ బేనర్‌లో వరుసగా చిత్రాలను తీస్తున్న డి.శివప్రసాద్‌రెడ్డి తాజాగా నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణం చివరి దశకు చేరుకున్నదని అన్నారు. ఇంకా ఈ చిత్రంలో షాయాజీషిండే, బ్రహ్మానందం, హర్షవర్ధన్, తనికెళ్ళ భరణి తదితరులు నటించనున్నారు.


Click it and Unblock the Notifications











