నాగార్జున గెస్ట్ రోల్ లో కనపించనున్న...
నాగార్జున త్వరలో అనూష్క ప్రధాన పాత్రలో చేస్తున్న తకిట తకిట చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సింధిల్ కుమార్ కెమెరా మెన్ గా పనిచేస్తున్నారు. భూమిక తన డౌన్ టౌన్ ఫిల్మ్ ప్రెవేట్ లిమిటెడ్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కోన వెంకట కథ,మాటలు అందిస్తున్నాడు. భూమికతో గతంలో సత్యభామ చిత్రాన్ని రూపొందించిన శ్రీహరి నాను ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. అలాగే డౌన్ టౌన్ ఫిల్మ్ వారు అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న యజ్ఞం చిత్రాన్ని సైతం సహ నిర్మాతగా వ్యవరిస్తున్నారు. ఇక నాగార్జున హీరోగా చేసిన కేడీ చిత్రం సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కిరణ్ అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు.
నాగార్జున అనుష్క సూపర్ గెస్ట్ రోల్ తకిట తకిట అరుణ్ ప్రసాద్ సత్యభామ కేడీ nagarjuna anushka super takita takita arun prasad kedi


Click it and Unblock the Notifications