The Ghost Twitter Review: విక్రమ్ తర్వాత ది ఘోస్ట్.. ఆ ట్విస్ట్‌కు మెంటలే.. ఓవరాల్ టాక్ ఏంటంటే!
అక్కినేని నాగేశ్వర్రావు కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని స్టార్ హీరోగా వెలుగొందుతోన్నాడు కింగ్ అక్కినేని నాగార్జున. సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఆయన.. ఈ ఏడాది ఆరంభంలోనే బంగార్రాజు చిత్రంతో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఈ జోష్‌తోనే ఆయన ఇప్పుడు 'ది ఘోస్ట్' అనే సినిమాలో నటించారు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో 'ది ఘోస్ట్' మూవీ ట్విట్టర్ రివ్యూ మీకోసం!

ది ఘోస్ట్‌గా వచ్చేసిన నాగార్జున
అక్కినేని నాగార్జున నటించిన తాజా చిత్రమే 'ది ఘోస్ట్'. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటించింది. మార్క్ కే రాబిన్ దీనికి సంగీతం ఇచ్చారు.
అలాంటి స్టోరీ... ఫుల్ యాక్షన్‌తో
ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా పని చేసే విక్రమ్ గాంధీ అనే వ్యక్తి ఘోస్టుగా ఎలా మారాడు? నేర సామ్రాజ్యాన్ని గడగడలాడించే శక్తిగా ఎలాంటి ప్రభావాన్ని చూపించాడు? అనే అంశాలతో 'ది ఘోస్ట్' మూవీ తెరకెక్కింది. ఇందులో అక్కినేని నాగార్జున పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తున్నాడు. ఈ మూవీ ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. దీంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి.
ఆ రోజులను గుర్తుకు తెచ్చేంది
అక్కినేని నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' మూవీ తాజాగా విడుదలైంది. ఈ సినిమా చూసిన ఓ నెటిజన్ 'అద్భుతమైన కథ, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్‌తో సినిమా అదిరిపోయింది. అక్కినేని నాగార్జున 1980 రోజులను మరోసారి గుర్తు చేశారు. చెన్నైలో ఓపెనింగ్స్ బాగున్నాయి. దీనికి మొదటి రోజు మంచి కలెక్షన్లు వస్తాయి' అంటూ చెప్పుకొచ్చాడు.
దసరా విన్నర్ ఘోస్ట్ అంటూ
కింగ్ అక్కినేని నాగార్జున 'ది ఘోస్ట్' మూవీ ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రాన్ని చూసిన ఓ నెటిజన్ తాజాగా 'గాడ్ ఫాదర్ కంటే ఘోస్ట్‌కు మంచి రివ్యూలు వస్తున్నాయి. ఇది మైండ్ బ్లోయింగ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. దసరా విన్నర్ అని చెప్పొచ్చు. మొత్తంగా ది ఘోస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది' అని ట్వీట్ చేశాడు.
అంచనాలను అందుకుందని
ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ది ఘోస్ట్' మూవీ షోలు ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో పడిపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్ 'ఇప్పుడే యూకేలో ది ఘోస్ట్ చూశాను. సినిమా అంచనాలను అందుకుంది. స్క్రీన్‌ప్లే, బ్యాగ్రౌండ్ స్కోర్, యాక్షన్ ఎపిసోడ్స్, టేకింగ్ చాలా బాగున్నాయి. టాలీవుడ్‌కు నాగార్జున టార్చ్‌బేరర్ అని చెప్పొచ్చు' అని ట్వీట్ చేశాడు.
ఇంటర్వెల్ ట్విస్ట్‌తో మెంటల్
అక్కినేని నాగార్జున హీరోగా నటించిన 'ది ఘోస్ట్' మూవీ ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని చూసిన ఓ నెటిజన్ తాజాగా ట్విట్టర్‌లో 'బ్లాక్‌బస్టర్ హిట్‌తో నాగ్ మామ కమ్‌బ్యాక్ అయ్యాడు. మాటలు రావడం లేదు. ఇంటర్వెల్ ట్విస్ట్‌కు మెంటల్ ఎక్కిపోద్ది. సెకెండాఫ్ అయితే కేకలా ఉంది' అంటూ సినిమాపై తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశాడు.
నాగార్జున వన్ మ్యాన్ షో అని
అక్కినేని నాగార్జున - ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో వచ్చిన 'ది ఘోస్ట్' మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది చూసిన ఓ నెటిజన్ 'యాక్షన్ సీక్వెన్స్‌లు, కథ ఈ సినిమాను పర్‌ఫెక్ట్‌గా మార్చాయి. నాగార్జున తన స్వాగ్‌తో వన్ మ్యాన్ షో చేశారు. ప్రవీణ్ సత్తారు సినిమాను కాస్త స్పైసీగా తెరకెక్కించాడు. కింగ్ ఈజ్ కింగ్' అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఖైదీ, విక్రమ్ తర్వాత ది ఘోస్ట్
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' మూవీని చూసిన ఓ నెటిజన్ తన అనుభూతిని పంచుకున్నారు. 'నా బ్రెయిన్ నుంచి క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం పోవడం లేదు. ఖైదీ, విక్రమ్ సినిమాల్లా అదిరిపోయే క్లైమాక్స్‌ను ఇందులో చూపించారు. నాగార్జునకు కావాల్సిన విజయం ఇది' అంటూ ఓ ట్వీట్ చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు.

ది ఘోస్ట్ ఫైనల్ రిపోర్ట్ ఏంటి?
నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' మూవీ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటి వరకూ అందిన రిపోర్టులను బట్టి ఈ సినిమాకు అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ వచ్చింది. మరీ ముఖ్యంగా ట్విట్టర్‌లో ఈ సినిమాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు, ఈ మూవీ నాగార్జున పాత రోజులను గుర్తుకు తెచ్చిందని కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











