Don't Miss!
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నాగార్జున ట్వీట్: నువ్వు సర్ప్రైజ్ ఇవ్వకుండా ఉండవు కదా కోడలా..!
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'యూటర్న్' మూవీ అఫీషియల్ ట్రైలర్ శుక్రవారం విడుదల చేశారు. కోడలు నటించిన సినిమా కావడంతో నాగార్జున కూడా ట్విట్టర్ ద్వారా ప్రమోట్ చేస్తున్నారు. అంతే కాదు... ట్రైలర్ తనకు ఎంతో నచ్చిందని పేర్కొన్నారు. 'వావ్ నువ్వు సర్ప్రైజ్ ఇవ్వకుండా ఉండవు కదా కోడలా! అంటూ నాగ్ చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. యూటర్న్ చిత్రానికి పవన్ కుమార్ దర్శకుడు. కన్నడలో హిట్టయిన చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
|
కోడలా అంటూ నాగార్జున ట్వీట్
ఈ మధ్య కాలంలో సమంత గురించి ఏదైనా ట్వీట్ చేయాల్సి వస్తే.... ప్రత్యేకంగా కోడలా అంటూ సంబోధిస్తూ మరీ నాగార్జున తన ప్రత్యేకత చాటుకుంటున్నారు. గతంలోనూ సమంత టాలెంట్ గురించి నాగార్జున పలు సందర్భాల్లో ప్రశంసలు గుప్పించిన సంగతి తెలిసిందే.
|
మై లేడీ మూవీ అంటూ చైతూ
నాగ చైతన్య కూడా మై లేడీ (నా భార్య) మూవీ అంటూ గర్వంగా ట్విట్టర్ ద్వారా ‘యూటర్న్' ట్రైలర్ షేర్ చేశారు. ఈ సినిమాలో నటిగా ఆమె మరింత పరిణితి చెండం ఆనందంగా ఉందన్నారు. చిత్ర బృందానికి ఈ సందర్భంగా చైతూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
యూటర్న్ మూవీ
ఈ చిత్రంలో సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబరు 13న సినిమా విడుదల కాబోతోంది. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఏమిటి కథ?
యూటర్న్ మూవీ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఇందులో భూమిక దెయ్యం పాత్రలో కనిపించబోతోంది. ఆత్మగా మారిన భూమిక ప్రతీకారం తీర్చుకోవడానికి, యూటర్న్ కాన్సెప్టుకు లింక్ ఏమిటి? అనేది ఆసక్తికర అంశం.