వివాహ దినోత్సవం.. పార్టీలో మునిగి తేలిన మన్మథుడు
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున గురించి అందరికీ తెలిసిందే. స్క్రీన్‌పై ఎంత చలాకీగా ఉంటాడో తెర వెనుకా అంతే సరదాగా ఉంటాడు. ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే.. ఖాళీ దొరికనప్పుడల్లా శ్రీమతితో కలిసి విదేశాలకు చెక్కేస్తుంటాడు. జూన్ 11న వీరి వివాహ దినోత్సవం. ప్రతీ యేటా విదేశాల్లో ఎంతో ఘనంగా సెలెబ్రేట్ చేసుకునే ఈ జంటకు ఈసారి మాత్రం నిరాశే ఎదురైంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశం దాటలేము. అందుకు ఇక్కడే వీరిద్దరు తమ పెళ్లి రోజును సెలెబ్రేట్ చేసుకున్నారు.
'ప్రేమయుద్ధం', 'కిరాయి దాదా', 'శివ', 'నిర్ణయం' వంటి సినిమాలలో కలిసి నటించిన నాగార్జున అమల.. 1992 జూన్ 11న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో ఇంటి వద్దే వీరి పెళ్లి రోజును జరుపుకున్నారు. అయితే ఈ సెలెబ్రేషన్స్‌లో ఇతర ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ కూడా కనబడలేదు. వీరిద్దరే ఏకాంతంగా ఉన్నారు.

తమకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలని సోషల్ మీడియా వేదికగా నాగ్ తెలిపాడు. ఈ సందర్భంగా నాగార్జున తన సతీమణి అమలతో కలిసి ఆనందంగా గడుపుతున్న ఒక పిక్ షేర్ చేసి 'ఇలాంటి ట్రబులింగ్ టైమ్ లో కూడా మాకు బ్లెస్సింగ్స్ అందించినందుకు మీకు ధన్యవాదాలు. బీ వెల్ మై ఫ్రెండ్స్'అంటూ పోస్టు చేసాడు. అయితే ఇందులో వీరిద్దరి కంటే.. ఆ ఫోటోలో ఉన్న వస్తువులపైనే దృష్టి మరలింది. టేబుల్ పైన వైన్ ఉన్నట్టు.. నాగ్ ఓ పెగ్గేసి ఉంటారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











