twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున ట్వీట్ దేనికి సంకేతం.. అలాంటి పని మేము చేయలేదు, ఆఫీసర్ బయ్యర్ల పరిస్థితి ఏంటి!

    |

    నాగార్జున, రాంగోపాల్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన ఆఫీసర్ చిత్రం దారుణంగా నిరాశపరిచింది. ఆఫీసర్ డిస్ట్రిబ్యూటర్స్ కి ఈ చిత్రం కోలుకోలేని దెబ్బ. ఆంధ్ర రీజియన్ లో చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన సుబ్రహ్మణ్యం తనకు ఆత్మహత్యే శరణ్యం అంటున్నాడు. అతడు దారుణంగా నష్టాలని చవిచూసినట్లు తెలుస్తోంది. అని ఏరియాలలో బయ్యర్లది ఇదే పరిస్థితి. కానీ సినిమా నిర్మాణంలో భాగమైన వర్మకు మాత్రం మంచి లాభాలే ముట్టినట్లు తెలుస్తోంది. తాజగా ఆఫీసర్ చిత్ర పరాజయాన్ని ప్రస్తావిస్తూ నాగార్జున చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో చిత్ర నిర్మాత సుధీర్ చంద్ర కూడా కీలక వ్యాఖ్యలు చేసారు.

    Recommended Video

    Officer Had A Disaster Talk
    నాగార్జున సినిమా అనుకుని

    నాగార్జున సినిమా అనుకుని

    మొదట ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడానికి ఆంధ్ర ప్రాంతంలో ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా ముందుకు రాని పరిస్థితి ఉంది. కానీ మినిమమ్ గ్యారెంటీ ప్రైస్ విధానంతో సుబ్రహ్మణ్యం ఆఫీసర్ చిత్రాన్ని కొనుగోలు చేశారు. నాగార్జున సినిమాకు మినిమమ్ వసూళ్లు వస్తాయని భావించిన బయ్యర్లు ఈ చిత్రాన్ని కొన్నట్లు తెలుస్తోంది.

    కోట్ల సంగతి పక్కన పెడితే

    కోట్ల సంగతి పక్కన పెడితే

    సాధారణంగా స్టార్ హీరో సినిమా విడుదలయిందంటే ఎంత నెగిటివ్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్ మాత్రం బలంగా ఉంటాయి. కోట్లల్లో షేర్ నమోదవుతుంది. కానీ ఆఫీసర్ చిత్ర విషయానికి వస్తే కోట్లు సంగతి పక్కన పెట్టి లక్షలు గురించి మాట్లాడుకోవడం కూడా కష్టంగా ఉంది. ఈ మధ్య కాలంలో ఏ స్టార్ హీరోకి రానంత దారుణంగా ఆఫీసర్ వసూళ్లు ఉన్నాయి.

    నాగార్జున ట్వీట్

    ఆఫీసర్ చిత్ర పరాజయాన్ని పరోక్షంగా అంగీకరిస్తూ నాగార్జున తాజగా ఓ ట్వీట్ చేశాడు. జయాపజయాలు శాశ్వతం కాదు అనే విన్స్టన్ చర్చిల్ కొటేషన్ ని నాగార్జున ట్వీట్ చేశారు. ఆఫీసర్ చిత్రంపై నాగార్జునకు ముందు నుంచి కాన్ఫిడెన్స్ లేదనే విషయాన్ని ఫాన్స్ ప్రస్తావిస్తున్నారు.

    అక్కినేని అభిమానుల కోరిక

    అక్కినేని అభిమానుల కోరిక

    వర్మ, అఖిల్ కాంబోలో సినిమా గురించి ఆలోచనని నాగార్జున వెంటనే తుడిచిపెట్టాలని అక్కినేని ఫాన్స్ కోరుకుంటున్నారు. ఆ విధంగానే నాగార్జున ట్వీట్ కు రిప్లై ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలో వర్మ నుంచి ఒక్క సరైన చిత్రం కూడా రాలేదని, ఒకవేళ వర్మతో అఖిల్ సినిమా చేస్తే అతడి కెరీర్ పణంగా పెట్టినట్లు అవుతుందని ఫాన్స్ సూచిస్తున్నారు.

    గగ్గోలు పెడుతున్న బయ్యర్లు

    గగ్గోలు పెడుతున్న బయ్యర్లు

    ఆఫీసర్ చిత్రం విషయంలో నిర్మాత వాదన వేరేలా ఉంది. సినిమా దారుణంగా పరాజయం చెంది బయ్యర్లు కోలుకోలేని నష్టాలు మిగిల్చింది. బలవంతంగా తమచేత ఈ చిత్రాన్ని కొనిపించారని కొందరు బయ్యర్లు ఆరోపిస్తున్నారు. నిర్మాత మాత్రం సుధీర్ చంద్ర మాత్రం వేరేలా వాదిస్తున్నారు.

    అలాంటి పని చేయలేదు

    అలాంటి పని చేయలేదు

    అన్ని విభాగాల్లో ఆఫీసర్ చిత్రం పరాజయం చెందిన విషయాన్ని సుధీర్ చంద్ర అంగీకరించారు. బయ్యర్లు నష్టాలు వస్తున్న సంగతి వాస్తవమే. కానీ తాము ఎవరికీ ఈ చిత్రాన్ని బలవంతంగా అమ్మలేదని సుధీర్ చంద్ర తెలిపారు. ఆంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సినిమాని మినిమమ్ గ్యారెంటీ విధానంలో అమ్మామని సుధీర్ చంద్ర తెలిపారు.

    వర్మ రిప్లై

    నాగార్జున చేసిన ట్వీట్ కు వర్మ ఆమెన్ అంటూ రిప్లై ఇవ్వడం విశేషం. ఆఫీసర్ చిత్రం విషయంలో వర్మపై సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగుతున్నాయి. నాగార్జున లాంటి స్టార్ హీరోని పెట్టి తూతూ మంత్రంగా సినిమాని తెరక్కించాడని అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.

    English summary
    Nagarjuna tweet on Officer movie flop. Producer Sudheer Chandra response on buyers issue
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X