కోడలు సమంత ఫొటో పెట్టి.. నాగార్జున ట్వీట్.. ఏమన్నాడో తెలుసా?
రాజుగారి గది2 చిత్రం మంచి కలెక్షన్లను సొంతం చేసుకొన్నది. ఈ నేపథ్యంలో సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు, అభిమానులకు నాగార్జున ధన్యవాదాలు తెలిపారు.
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, అక్కినేని ఇంటి కోడలు సమంత, దర్శకుడు ఓంకార్ కాంబినేషన్‌లో వచ్చిన రాజుగారి గది2 చిత్రంపై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కనిపిస్తున్నది. శుక్రవారం (13 అక్టోబర్) రోజున రిలీజైన ఈ చిత్రం మంచి కలెక్షన్లను సొంతం చేసుకొన్నది. ఈ నేపథ్యంలో సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు, అభిమానులకు నాగార్జున ధన్యవాదాలు తెలిపారు.
రాజుగారి గది2 సినిమాపై వస్తున్న ఆదరణపై స్పందిస్తూ నాగార్జున ట్విట్టర్‌లో ఓ సందేశాన్ని ట్వీట్ చేశారు. రాజుగారి గది2ను ఆదరించిన ప్రతి ఒక్కరికీ, మాపై ప్రేమాభిమానాలను కురిపిస్తున్నందుకు థ్యాంక్స్ అని ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











