‘గుంటూరు మిర్చి’తో కొత్త చాప్టర్ షురూ.. రంగంలోకి నాగ్.. మెహబూబ్ ప్లాన్ అదుర్స్
బిగ్ బాస్ నాల్గో సీజన్ ఎంతో మంది కంటెస్టెంట్లకు కొత్త లైఫ్ ఇచ్చింది. అంత వరకు ఎవ్వరో తెలియని వారిని కూడా స్టార్స్, సెలెబ్రిటీలను చేసేసింది బిగ్ బాస్ షో. సోషల్ మీడియాలో ఫేమస్ అయి.. బిగ్ బాస్ షోలో చాన్స్ సంపాదించి బుల్లితెరపై సందడి చేశారు. అలా ఇప్పుడు బుల్లితెర టు వెండితెరకు పయనమవుతున్నారు. అందరికీ సినిమాలు, వెబ్ సిరీస్ అంటూ అవకాశాలు వెల్లువెత్తున్నాయి. అందరూ ఫుల్ బిజీ అవుతున్నారు.

ఆఫర్ల వెల్లువ..
బిగ్ బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్లు అయిన సోహెల్, అఖిల్, మెహబూబ్, మోనాల్, దివి, అభిజిత్, అరియానా, హారిక ఇలా చాలా మందికి వెండితెర, ఓటీటీలపై అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ఇందులో చాలా మంది అనేక ప్రాజెక్ట్‌ల్లో ఓకే అయ్యారు. ఇంకా కొన్ని చర్చల దశల్లోఉన్నాయి. సోహెల్, అభిజిత్ హీరోలుగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

దివి, మోనాల్ అలా..
ఇక బిగ్ బాస్ యాపిల్ బ్యూటీ దివికి మాత్రం మంచి ఆఫర్లే వస్తున్నాయి. మెగా హీరోల చిత్రాల్లో చాన్స్‌లు వచ్చాయి. చిరు, పవన్ మూవీల్లో దివి నటించబోతోంది. కానీ దివికి మెయిన్ లీడ్‌గా సరైన అవకాశం రావడం లేదు. ఇక మోనాల్ ఐటెం సాంగ్, స్పెషల్ అప్పీయరెన్స్, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది.

వెబ్ సిరీస్‌లతో రచ్చ..
అఖిల్ మోనాల్ కలిసి ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. గుజరాతీ అమ్మాయి.. తెలుగబ్బాయి అనే వెబ్ సిరీస్‌తొ ఈ ఇద్దరూ రాబోతోన్నారు. ఇక అరియానా కూడా రాజ్ తరుణ్ మూవీతో హీరోయిన్‌గా రాబోతోంది. హారిక కూడా సినిమాలతో బిజీగా ఉంది.

మెహబూబ్ కూడా..
మెహబూబ్ అందరి కంటే ఎక్కువ ప్రాజెక్ట్‌లను పట్టేసుకున్నాడు. ఆల్రెడీ ఫినాలె ఎపిసోడ్ నాడు తన ఆఫర్ల లిస్ట్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సినిమాలు, వెబ్ సిరీస్ అంటూ రచ్చ చేసేందుకు రెడీ అయ్యాడు. అయితే తాజాగా తన కొత్త వెబ్ సిరీస్ పోస్టర్‌ను నాగార్జున చేతుల మీదుగా రిలీజ్ చేయించాడు.

గుంటూరు మిర్చీ..
భూమి ని చీల్చే ప్రతి నాగలి మనిషి ని మార్చే ప్రతి ఆలోచన ఒక కొత్త ఒరవడి కోసమే.... అంటూ గుంటూరు మిర్చి పోస్టర్‌తో మెహబూబ్ సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. ఇక ఈ పోస్టర్‌ను నాగ్ రిలీజ్ చేయడంతో మెహబూబ్ గాల్లో తేలిపోతోన్నాడు. ఇప్పటికే ఆచార్య చిత్రంలో మెహబూబ్ ఓ కీ రోల్ పోషించాడని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











