సారీ రా... అంటూ షాకిచ్చిన నాగార్జున, ఇది చీటింగ్ అంటూ చిన్నబోయిన అఖిల్!
Recommended Video

నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ త్వరలో 'హలో' మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇటీవల విడుదలైన 'హలో' ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా ప్రమోషన్లో భాగంగా సినిమాలోని వెడ్డింగ్ సాంగ్ టీజర్ నాగార్జున విడుదల చేశారు. అయితే ఈ సాంగ్ టీజర్ విడుదల సందర్భంగా నాగార్జున, అఖిల్ మధ్య ట్విట్టర్లో ఫన్నీ చిట్ చాట్ జరిగింది.

అఖిల్.. నాకు ఈ విషయం చెప్పలేంటి?
"హలో ఆడియో ఫైనల్ మిక్స్ విన్నాను, అన్ని పాటలు చాలా బావున్నాయి' అని నిన్న సాయంత్రం ట్విట్టర్ ద్వారా తెలిపిన అఖిల్, బుధవారం సినిమాలోని ఓ సాంగ్ టీజర్ మీకోసం రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అఖిల్ చేసిన ఈ ట్వీట్ మీద నాగార్జున స్పందిస్తూ.... సాంగ్ లాంచ్ చేయబోతున్నట్లు నువ్వు నాకు చెప్పలేదేంటి? నువ్వు విడుదల చేయబోతున్న సాంగ్ ఇదేనా? ఈ సాంగ్ చిత్రీకరించిన సెట్ చాలా అందంగా ఉంది అంటూ.... నాగార్జున ఓ ట్వీట్ చేశారు.
సారీ రా... అంటూ షాకిచ్చిన నాగార్జున
బుధవారం ఉదయం అఖిల్ సాంగ్ రిలీజ్ చేస్తాడని ఎదురు చూసిన నాగార్జున, అఖిల్ లేట్ చేయడంతో.... సారీ రా, ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు అంటూ తన ట్విట్టర్ ద్వారా సాంగ్ రిలీజ్ చేసి అఖిల్‌కు షాకిచ్చాడు.

చీటింగ్ అంటూ చిన్నబోయిన అఖిల్
తాను రిలీజ్ చేస్తాననుకున్న సాంగ్.... నాన్న రీలీజ్ చేయడంతో షాకైన అఖిల్ వాట్ ఈజ్ దిస్ చీటింగ్ డాడ్? అంటూ సరదాగా కామెంట్ చేశాడు. ఏమైతేనేం... ఈ సాంగ్ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను అంటూ అఖిల్ నమ్మకం వ్యక్తంచేశారు.

సాంగ్ విజువల్స్ అదుర్స్
నాగార్జున చెప్పినట్లే ఈ సాంగ్ కోసం వేసిన సెట్స్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ పాటలో అఖిల్ మరింత స్మార్ట్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. అనూప్ అందించిన ట్యూన్స్ కూడా బావుంది.

కళ్యాణి ప్రియదర్శన్
ఈ చిత్రం ద్వారా ప్రముఖ సౌతిండియన్ డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురు కళ్యాణి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఆమె అఖిల్‌కు తగిన జోడీగా పర్ఫెక్ట్ గా సెట్టయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

క్యూట్ లవ్ స్టోరీ
ఒక క్యూట్ లవ్ స్టోరీ నేపథ్యానికి యాక్షన్ స్క్రీన్ ప్లే జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హీరో, హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్నాయి.

జగపతి బాబు, రమ్యకృష్ణ
ఈ చిత్రంలో అఖిల్ తల్లిదండ్రులుగా జగపతి బాబు, రమ్యకృష్ణ నటిస్తున్నారు. వీరిద్దరి జోడీ కూడా బావుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా ఈ సినిమా ఉండబోతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ట్రైలర్ అదుర్స్
సినిమాలో యాక్షన్ సీన్లు అదిరిపోయే విధంగా ఉన్నాయి. ట్రైలర్ చూసిన వారంతా హాలీవుడ్ స్థాయిలో స్టంట్స్ ఉన్నాయని అంటున్నారు. ‘హలో' చిత్రాన్ని డిసెంబర్ 22న గ్రాండ్ గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. నాగార్జున ఈ చిత్రానకి నిర్మాత.


Click it and Unblock the Notifications











