ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో నాగార్జున ఆఫీసర్, నేటితో షూటింగ్ పూర్తి!
తెలుగు చలనచిత్ర చరిత్రలో 'శివ' సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. అంతటి ఘనవిజయం సాధించిన సంచలనాత్మక చిత్రాన్ని అందించిన అక్కినేని నాగార్జున, సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'ఆఫీసర్'. ఈ చిత్ర షూటింగ్ పార్ట్ శనివారం (ఏప్రిల్ 28) రోజున పూర్తి అయ్యింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి రెస్పాన్స్ లభించింది.
ముంబై కేంద్రంగా కథ మొత్తం నడుస్తుందని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. ఓ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం నాగార్జున హైదరాబాద్ నుంచి ముంబైకి స్పెషల్ ఆఫీసర్‌గా వెళ్తారని సమాచారం. మైరా శరీన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో షియాజీ షిండే ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.

ఈ సినిమా సీరియస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. అజయ్ ఈ సినిమాలో పోలిస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మే నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముంబై మాఫియా నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం.


Click it and Unblock the Notifications











