సమంత సెట్ చేసింది... ఒకే వేదికపైకి నాగార్జున-వెంకటేష్!
నాగచైతన్య, సమంత జంటగా రూపొందుతున్న 'మజిలీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ అరుదైన కలయికకు కారణం కాబోతోంది. చాలా రోజుల తర్వాత నాగార్జున, వెంకటేష్ కలిసి ఒకే వేదిక పంచుకోబోతున్నారు. నాగ చైతన్య తొలి చిత్రం సమయంలో ఇద్దరూ కలిసి వచ్చారు... మళ్లీ ఇన్నాళ్ల తర్వాత వీరు ఒకే సినీ వేడుకలో కనిపించబోతున్నారు.
'మజిలీ' మూవీ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్చి 31న ప్లాన్ చేశారు. ఇదే వేదికపై మూవీ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

తెరవెనక చక్రం తిప్పిన సమంత
పెళ్లి తర్వాత నాగ చైతన్య-సమంత కలిసి నటిస్తున్న చిత్రం ‘మజిలీ'. అందుకే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పెషల్‌గా ఉండాలనే కారణంతో ఇలా ప్లాన్ చేశారట. సమంత కోరిక మేరకు నాగ చైతన్య స్వయంగా వెళ్లి తన తండ్రి నాగార్జునతో పాటు వెంకీ మామను ప్రీ రిలీజ్ ఈవెంటుకు ఆహ్వానించినట్లు సమాచారం.

అభిమానులకు విజువల్ ఫీస్ట్
నాగార్జున, వెంకటేష్ కలిసి ఒకే వేదికపై కనిపించబోతుండటం ఇటు అభిమానులకు సైతం విజువల్ ఫీస్ట్‌గా ఉండబోతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గరపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.

సినిమాపై పెరిగిన క్రేజ్
చైతు, సమంత కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ట్రేడ్ వర్గాల్లో సినిమాపై క్రేజ్ ఏర్పడింది. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమేజాన్ ప్రైమ్ రూ. 3.5 కోట్లకు కొనుగోలు చేయగా, హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 4 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. మరో వైపు థియేట్రికల్ బిజినెస్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది.

మజిలీ
రావు రమేష్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజ్ ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తుండగా.. విష్ణు వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గరపాటి, హరీష్ పెద్ది మజిలి సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: శివ నిర్వాన, సంగీతం: గోపీ సుందర్, సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ, ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్, ఎడిటర్: ప‌్రవీణ్ పూడి, యాక్షన్: వెంకట్


Click it and Unblock the Notifications











