»   » నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్ బాబు.... శ్రీదేవి మరణంపై!

నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్ బాబు.... శ్రీదేవి మరణంపై!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  శ్రీదేవి మరణంపై.. టాలీవుడ్ ప్రముఖుల దిగ్బ్రాంతి !

  ఒకప్పుడు ఇండియన్ సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి కేలం 54 ఏళ్ల వయసులో అర్దాయుష్షుతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం అభిమానులు, ఆమెతో కలిసి పని చేసిన నటీనటులను విషాదంలోకి నెట్టి వేసింది. శ్రీదేవితో కలిసి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, బాలకృష్ణ తదితరులు ఆమె హఠాన్మరణంపై స్పందించారు. తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

  ఇది ఒక పీడకల

  ఇది ఒక పీడకల

  శ్రీదేవి మనల్ని విడిచిపెట్టిన సత్యాన్ని ఎదుర్కొనేందుకు నేను ఉదయం అంతా ప్రయత్నిస్తున్నాను. ఆమె మరణాన్ని కేవలం ఒక పీడకలగా భావిస్తాను. 'మేమంతా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం,
  ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.... అని నాగార్జున వ్యాఖ్యానించారు.

  శ్రీదేవి గారి హటాన్మరణం బాధాకరం: నందమూరి బాలకృష్ణ

  శ్రీదేవి గారి హటాన్మరణం బాధాకరం: నందమూరి బాలకృష్ణ

  శ్రీదేవిగారితో నాన్నగారు చాలా సినిమాల్లో నటించారు. ఎలాంటి భావాన్నైనా కళ్ళతోనే పలికించగల మహానటి శ్రీదేవిగారు. ఆవిడ హటాన్మరణం చిత్రసీమకు తీరని లోటు. ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని వేడుకొంటున్నాను.... అని బాలయ్య అన్నారు.

  శ్రీదేవిగారి కుటుంబంతో నా అనుబంధం మరువలేనిది: ఎఎం రత్నం

  శ్రీదేవిగారి కుటుంబంతో నా అనుబంధం మరువలేనిది: ఎఎం రత్నం

  శ్రీదేవిగారితో నా అనుబంధం ఈనాటిది కాదు. నా సూపర్ హిట్ సినిమాల్లో ఎక్కువగా హిందీలో రీమేక్ చేసింది బోణీ కపూర్ గారే. ముంబై వెళ్ళినప్పుడల్లా శ్రీదేవిగారి ఇంటికి వెళ్లకుండా ఎప్పుడూ వెనుదిరగలేదు. అటువంటి మంచి మనిషి, అద్భుతమైన నటి నేడు మన మధ్య లేదు అన్న చేదు నిజాన్ని దిగమింగడం చాలా కష్టంగా ఉంది... నిర్మాత ఏఎం రత్నం అన్నారు.

  శ్రీదేవి మరణం భారతీయ చిత్రసీమకు తీరని లోటు: డా.మోహన్ బాబు

  శ్రీదేవి మరణం భారతీయ చిత్రసీమకు తీరని లోటు: డా.మోహన్ బాబు

  శ్రీదేవి కుటుంబంతో నాకు తిరుపతి నుండి మంచి అనుబంధం ఉంది. ఆమె తల్లి తిరుపతికి చెందినవారు. శ్రీదేవితో కలిసి చాలా సినిమాల్లో నటించాను. భారతీయ చిత్రసీమ మంచి నటిని మాత్రమే కాదు, ఉన్నతమైన వ్యక్తిని కూడా కోల్పోయింది. నా 42వ సినీ జీవిత ఉత్సవాలు విశాఖపట్నంలో జరుగుతున్నప్పుడు కేవలం ఫోన్ చేయగానే వైజాగ్ వచ్చి, ఆ వేడుకల్లో పాల్గొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనోనిబ్బరాన్ని ఆ శిరిడీ సాయినాధుడు ప్రసాదించాలని కోరుకొంటున్నాను.

  వెంకటేష్

  వెంకటేష్

  శ్రీదేవి మరణంపై వెంకటేష్ స్పందిస్తూ.... ఈ విషయం తెలిసి షాకయ్యాను. శ్రీదేవి ఇక లేరనే విషయం నన్ను విషాదంలోకి నెట్టి వేసింది. ఆమెతో కలిసి నటించిన ‘క్షణక్షణం' నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని సినిమా. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను... అని వెంకటేష్ తెలిపారు.

  English summary
  "I have been trying all morning to gather myself to face the truth of dear sridevi leaving us,trying to believe it’s just a bad dream/memories of her just keep coming back and I don’t know whether to smile or cry. We love you dear Sridevi." Nagarjuna said.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more