రాజమౌళి, నాగార్జున కాంబినేషన్ చిత్రం 'రాజన్న'

By Srikanya

నాగార్జున హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణమయ్యే చిత్రానికి 'రాజన్న' అనే టైటిల్ కన్ఫర్మ్ చేసే అవకాశముంది. విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం చారిత్రక నేపధ్యంలో జరుగుతుంది. నాగార్జున సెకెండాఫ్ లో కనిపించే ఓ కీలకమైన పాత్ర చేస్తున్నారు. నాగార్జున కనపించే ఎపిసోడ్స్ మొత్తం విజయేంద్రప్రసాద్ కుమారుడు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరక్ట్ చేయనున్నారు. తెలంగాణ నేఫద్యంలో పీరియాడిక్ గా ఈ ఎపిసోడ్ ఉంటుందని యాక్షన్ ప్రధానంగా రూపొందుతుందని సమాచారం. ఇక నాగార్జున ప్రస్తుతం వీరూపోట్ల దర్శకత్వంలో కామాక్షి ఎంటర్ ప్రైజస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రంలో చేస్తున్నారు. అనుష్క,ప్రియమణి హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. అలాగే శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మించే సోషియో ఫాంటసీ చిత్రం కూడ త్వరలో ప్రారంభం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X