శ్రీవారి కోసం...బోడి గుండుతో నాగార్జున
అక్కినేని నాగార్జున శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా వచ్చారు. తెల్లవారు ఝామునే 4-5 గంటల మధ్య వీపీ కోటాలో భార్య అమల, చిన్న తనయుడు అఖిల్ తో కలిసి ఏడుకొండల వాడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నాగార్జున తలనీలాలు సమర్పించి బోడిగుండుతో కనిపించాడు. నాగార్జునను ఇదివరకెన్నడూ బోడిగుండుతో చూడని అభిమానులు....ఈ దృశ్యం చూసి ఆశ్యర్య పోయారు. నాగార్జున తల్లి అన్నపూర్ణ పది రోజుల క్రితం మరణించిన విషయం తెలిసిందే.
ఇటీవల విడుదలైన నాగార్జున తాజా సినిమా 'రాజన్న' పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతోంది. నాగార్జున ప్రస్తుతం డమరుకం సినిమాలో నటిస్తున్నాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగు ఈ చిత్రంలో నాగార్జున సరసన అనుష్క నటిస్తుండగా, శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











