twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బి.జయ దర్శకత్వంలో సినిమా చేస్తా: నాగార్జున

    By Srikanya
    |

    ''నేను చాలామంది దర్శకులతో పనిచేశాను కానీ, మహిళా దర్శకులతో చేయలేదు. మంచి కథతో వస్తే బి. జయ దర్శకత్వంలో సినిమా చేస్తా'' అని నాగార్జున అన్నారు. ఆది, శాన్వి జంటగా బి.జయ దర్శకత్వంలో బి.ఎ. రాజు నిర్మించిన 'లవ్‌లీ' వందరోజుల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ ఆ విధంగా స్పందించారు.

    అలాగే ఆ పంక్షన్ కి హాజరైన దాసరి నారాయణ రావు మాట్లాడుతూ..."ఈ మధ్య చిన్న హీరోలు కూడా కథ అడుగుతున్నారు. వాళ్లకు కథ గురించి ఏం తెలుసు! ఎన్టీఆర్, ఎయన్నార్ కూడా ఏనాడూ కథ అడగలేదు. సినిమా ఆడకపోతే తారలకన్నా సాంకేతిక నిపుణులకే ఎక్కువ నష్టం..ఇక ఈ ఏడాది చాలా చిన్న సినిమాలు విజయం సాధించి పరిశ్రమకు ఊపిరిపోశాయి" అన్నారు.

    "అలాగే 'లవ్‌లీ' కూడా ఆ కోవకు చెందుతుంది. విజయనిర్మల్లాగానే బి.జయ కూడా పని రాక్షసి. మన తెలుగులోనే ఎక్కువ మంది లేడీ డెరైక్టర్స్ ఉండడం గర్వకారణం. హీరో ఆది చిన్న నిర్మాతలకు అండగా నిలబడాలి" అని దాసరి అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా కె. రాఘవేంద్రరావు, పరుచూరి గోపాలకృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డి, పూరి జగన్నాథ్, వి. వినాయక్, సునీల్, అచ్చిరెడ్డి, దశరథ్, సురేష్ రెడ్డి, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు. యూనిట్ సభ్యులకు అతిథులు షీల్డులందించారు.

    English summary
    Nagarjuna attended the 100 days function of ‘Lovely’ today and expressed happiness over the movie’s success. Speaking at the occasion, Nagarjuna said that “I have always wanted to work with a female director and if Jaya has a good story, I am willing to act in her direction”, said Nagarjuna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X