నాకు సినిమా ఎంతో ఇచ్చింది..సినిమాకి తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను..ఇది మంచి ఆలోచన కాదా అని ప్రశ్నిస్తున్నారు నాగార్జున. ఈ రోజు ఓ ప్రముఖ పత్రికలో ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ..తాను ఫిల్మ్ అకాడమి స్టార్ట్ చేయబోతున్నానని చెప్పుకొచ్చారు. అన్ని క్రాఫ్టుల్లో కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ ఇచ్చే ఫిల్మ్ అకాడమి ప్రారంభించనున్నట్లు తెలిపారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా హాలివుడ్ స్టాండర్డ్స్ లో చేస్తున్నట్లు తెలియబరిచారు. ఒక మెడికల్ కాలేజి ప్రక్కన హాస్పటల్ ఉంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా వస్తుందో అలాగే ట్రైనింగ్ పొందేవాళ్ళకి స్టూడియో ప్రక్కనే ఉండటం వల్ల అదే ఎడ్వాంటేజ్ లభిస్తుందనో ఉద్దేశ్శంతో చేస్తున్నానని చెప్పుకొచ్చారు. అలాగే తెలుగు సినిమాకి ఇంటర్నేషనల్ వాతావరణాన్ని కల్పించాలని ఉందని అంటున్నారాయన. ఆయన ఆలోచనలు ఫలవంతమయ్యి తెలుగులో మంచి ఫిల్మ్ ఎకాడమి ఏర్పడి మంచి సినిమాలకు అంకురార్పణ జరగాలని కోరుకుందాం.