అఖిల్ చాలా హైపర్ యాక్టివ్, మంచోడు.. కానీ చైతూనే అలాంటోడు : వైరల్​గా అక్కినేని అమల కామెంట్స్

హీరో నాగచైతన్యపై అక్కినేని అమల ఇంట్రెస్టింగ్ కామెంట్స్​ చేశారు. ఆయన వ్యక్తిత్వాన్ని గురించి వివరించారు. అసలు చైతూ ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా ఉంటారు అన్న విషయాల గురించి మాట్లాడారు. అలాగే అక్కినేని అఖిల్​ గురించి కూడా చెప్పుకొచ్చారు. ఓ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదంతా చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దాని గురించే ఈ కథనం..

అమల గురించి చాలా మంది తెలుగు ప్రేక్షకులకు తెలిసిన విషయమే. సీనియర్ హీరో నాగార్జునకు రెండో భార్య. ఆయన మొదటి భార్య లక్ష్మి ప్రముఖ నిర్మాత రామానాయుడు కూతురు. వీరికి నాగ చైతన్య జన్మించారు. ఆ తర్వాత కొద్ది కాలానికి వీరిద్దరు విడిపోయారు.

Nagarjuna Wife Akkineni Amala Shocking Comments on NagaChaitanya and Akhil News Goes Viral

అనంతరం సినిమాలు చేసే కెరీర్​లో ముందుకెళ్లే క్రమంలో తనతో కలిసి నటించిన నటి అమలను ప్రేమించారు నాగ్. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు అఖిల్‌ జన్మించారు. పెళ్లి తర్వాత అమల సినిమాలను తగ్గించేసింది అమల. ఏదైనా బలమైన పాత్రలు, లేదా కీలకమైన పాత్రలు వస్తేనే నటిస్తోంది. ఆ మధ్య శర్వానంద్‌ నటించిన ఒకే ఒక జీవితంలో అమ్మ పాత్రలో నటించి మెప్పించింది.

అయితే అమల.. చైతూ, అఖిల్​ను ఇద్దరిని సమానంగా చూస్తుందనే చాలా మంది అంటుంటారు. ఇద్దరికీ ప్రేమను సమానంగా పంచుతుందని చెబుతుంటారు. తాజాగా వారిద్దరి గురించి అమల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇద్దరి వ్యక్తిత్వాలను, ఇద్దరి మధ్య బాండింగ్ గురించి వివరించింది.

ఇద్దరికీ అదే తేడా : "చైతన్యను నేను పెంచలేదు. వాళ్ల అమ్మనే పెంచింది. చెన్నై నుంచి అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు. ఎంతో మంచి వ్యక్తిత్వం ఉన్న అబ్బాయి. అఖిల్​కు ఓ మంచి బలమైన అన్నయ్య అతడు. ఇద్దరి మధ్య మంచి లవ్లీ బాండింగ్ ఉంటుంది. అస్సలు గొడవలు ఉండవు. చిన్నప్పుడైతే చైతూ ఎప్పుడు ఇంటికి వస్తాడా అని అఖిల్ ఎదురుచూస్తూ ఉంటాడు. చైతూ వస్తే అతడి వెనకాలే తోకలాగా తిరిగేవాడు. ఇద్దరి బంధం చూస్తే చూడ ముచ్చటగా అనిపించేది. చైతూ నాటీ కాదు. సైలెంట్​గా ఉంటాడు. తన తండ్రితోనే ఎక్కువగా గడిపేందుకు ఇష్టపడేవాడు. అఖిల్ హైపర్ యాక్టివ్. ఎన్నో యాక్టివిటీస్​లో పాల్గొంటాడు" అని అమల చెప్పుకొచ్చింది.

Nagarjuna Wife Akkineni Amala Shocking Comments on NagaChaitanya and Akhil News Goes Viral

నా గుండే హైస్పీడ్​లో కొట్టుకుంటుంది : "వీరిద్దరి సినిమాలు రిలీజ్​ అవుతుంటే నా గుండే బాగా కొట్టుకుంటుంది. కానీ జీవితం అనేది గొప్ప టీచర్ లాంటిది. వర్క్ పట్ల ప్యాషన్ ఉంటే చాలు. విజయాలు, పరాజయాలు వస్తుంటాయి. ఫెయిల్యూర్ ఉంటే నిరాశ తప్పక ఉంటుంది కానీ మరింత ఉన్నతంగా ఎదిగేందుకు మనకు అవకాశం కూడా వస్తుంది. అఖిల్​, చేతూ వాళ్ల నాన్నలాగే సినిమా అయిపోగానే దాని రిజల్ట్​ నుంచి బయటకు వచ్చేసి రెండో ప్రాజెక్ట్ చేస్తారు" అని అమల చెప్పింది.

ఇక చైతూ విషయానికొస్తే సాయిపల్లవితో కలిసి చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సీ కాన్సెప్ట్ మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. అఖిల్​.. యూవీ క్రియేషన్స్​ బ్యానర్​లో ఓ సోషియో ఫ్యాంటసీ సినిమా చేయబోతున్నారని ప్రచారం నడుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X