For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున సినిమా కూడా ఓటీటీలోనే.. భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్ డీలింగ్.. బాక్సాఫీస్ ఆఫర్

    |

    ఓటీటీలో పెద్ద సినిమాల రిలీజ్ అనేది భవిష్యత్తులో చాలా కామన్ అయిపోతుందని చెప్పవచ్చు. గతంలో ఎప్పుడు లేని విదంగా చిన్న బడ్జెట్ సినిమాలతో పాటు పెద్ద సినిమాలు.కూడా డిజిటల్ వైపే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా దెబ్బ కొట్టడంతో కొన్ని సినిమాల పరిస్థితి సందిగ్ధంలో పడింది. ఇక మరికొన్ని కనీసం ఓటీటీలోనైనా రిలీజ్ అవ్వాలని రెడీ అవుతున్నాయి. ఇక త్వరలో నాగార్జున సినిమా కూడా డైరెక్ట్ గా ఓటీటీలోకి రాబోతున్నట్లు టాక్ అయితే వస్తోంది. ఆ సినిమా మరేదో కాదు. NIA బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న వైల్డ్ డాగ్.

     అందుకే అలస్యమయ్యింది

    అందుకే అలస్యమయ్యింది

    ఈ ఏడాది సమ్మర్ ఎండింగ్ లోనే వైల్డ్ డాగ్ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ అనుకోకుండా దెబ్బ కొట్టిన కరోనా వల్ల తుది షెడ్యూల్ వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక దాదాపు 7 నెలల తరువాత షూటింగ్ ని స్టార్ట్ చేసి ఎండింగ్ దశలోకి తీసుకు వచ్చారు. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా త్వరలోనే ఫినిష్ కానున్నాయి.

     ఓటీటీలో వైల్డ్ డాగ్..?

    ఓటీటీలో వైల్డ్ డాగ్..?

    అసలు మ్యాటర్ లోకి వస్తే వైల్డ్ డాగ్ సినిమాపై ఓ వర్గం ఆడియేన్స్ లో అంచనాలు భారిగానే ఉన్నాయి. అయితే ఫైనల్ గా సినిమాను ఓటీటీ ద్వారానే రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కంటెంట్ బావుంటే ఎలాంటి సినిమా అయినా సరే జనాలకు చాలా ఈజీగా కనెక్ట్ అవుతోందని ఇటీవల కొన్ని సినిమాలు ఋజువు చేశాయి. అందుకే వైడ్ డాగ్ నిర్మాతలు కూడా చర్చలు మొదలుపెట్టినట్లు టాక్.

    Kadambari Kiran Supports KCR And Tells Voters To Support TRS In GHMC Elections 2020
    ఫోకస్ పెట్టిన నెట్ ఫ్లిక్స్

    ఫోకస్ పెట్టిన నెట్ ఫ్లిక్స్

    ఇక వైల్డ్ డాగ్ సినిమా ఓటీటీ హక్కుల కోసం కొన్ని సంస్థలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. హాట్ స్టార్ తో పాటు నెట్ ఫ్లిక్స్ సంస్థలు డీల్ కోసం భారీ అమౌంట్ ని ఆఫర్ చేసినట్లుగా టాక్ అయితే వస్తోంది. మొదట అమెజాన్ ప్రైమ్ ఓటీటీ హక్కులను దక్కించుకోవాలని అనుకుందని టాక్ అయితే వచ్చింది. ఇక ఇప్పుడు డైరెక్ట్ రిలీజ్ కాబట్టి డిమాండ్ అయితే పెరిగింది. అందుకే నెట్ ఫ్లిక్స్ సినిమాపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం.

    English summary
    Others are ready to be released, at least in OTT. Talk is coming that Nagarjuna movie is also coming directly to OTT soon. That movie is nothing else. Wild Dog is shaping up to be an action thriller in the NIA backdrop.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X