బాక్సాఫీస్ ఫైట్.. పవర్ స్టార్ కు పోటీగా గోపీచంద్, నాగార్జున!
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తరువాత బాక్సాఫీస్ వద్ద ప్రత్యేకమైన సందడి నెలకొంది. ఒక సినిమా తరువాత మరొకటి పోటాపోటీగా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అందుకుంటున్నాయి. క్రాక్, మాస్టర్, రెడ్ సినిమాలు సంక్రాంతి సీజన్ లో సాలీడ్ కలెక్షన్స్ అందుకోగా ఇటీవల వచ్చిన ఉప్పెన అంతకుమించి అనేలా కలెక్షన్స్ అందుకుంది. ఇక రానున్న రోజుల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు రాబోతున్నాయి. అందులో వకీల్ సాబ్ ఒకటి.
ఈ సినిమా ఏప్రిల్ 9న రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సమయానికి ఎవరు రావడం లేదు. పవర్ స్టార్ కంటే ఒక వారం ముందు మాత్రం ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధమయ్యారు. గోపిచంద్ సీటిమార్ ఏప్రిల్ 2న రాబోతున్న విషయం తెలిసిందే. ఇక అదే రోజు నాగార్జున వైల్డ్ డాగ్ కూడా రాబోతోంది. ఈ సినిమాపై ఓ వర్గం అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. చూస్తుంటే సినిమా తప్పకుండా బజ్ క్రియేట్ చేసేలా ఉందని అర్ధమవుతోంది.

అయితే ఇంతవరకు సినిమాకు సంబంధించిన టీజర్స్ ట్రైలర్స్ ఏమి రిలీజ్ కాలేదు. వైల్డ్ డాగ్ లో నాగ్ NIA ఆఫీసర్ గా కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే సినిమా ప్రాఫిట్స్ జోన్ లోకి రావాలి అంటే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కంటే ముందే కలెక్షన్స్ రాబట్టాలి. అలాగే గోపిచంద్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. వకీల్ సాబ్ సినిమాకు వారం గ్యాప్ ఉండడం కలిసొచ్చే అంశం. పవన్ సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన మిగతా సినిమా కలెక్షన్స్ పై ఎంతో కొంత ప్రభావం కనిపించడం కాయమని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











