ప్రేక్షకులను వెధవలు చేసే రోజులు పోయాయి.. చేస్తే అలాంటి రియాక్షన్.. నాగార్జున సీరియస్ టాక్..

By Rajababu

గ్రహణం, అష్టాచెమ్మా, అంతకు ముందు ఆ తర్వాత, జెంటిల్మన్ చిత్రాలతో ప్రేక్షకులకు మరింత చేరువైన ఇంద్రగంటి మోహనకృష్ణ తాజాగా సమ్మోహనం చిత్రంతో ముందుకొస్తున్నారు. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో అదితిరావు, సుధీర్‌బాబు జంటగా నటించిన ఈ చిత్రం జూన్ 15న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. సినిమా విడుదలను పురస్కరించుకొని ఇంద్రగంటి మోహనకృష్ణ తెలుగు ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రేక్షకులకు కోరుకొంటున్న కంటెంట్‌ను అందించడంలో తెలుగు పరిశ్రమ అడుగులు వేస్తున్నది.

 ఆ సినిమాలు గొప్ప మార్పు

ఆ సినిమాలు గొప్ప మార్పు

తెలుగు సినిమా విజన్ మారుతున్నది. రంగస్థలం, మహానటి చిత్రాలు అందుకు ఉదాహరణ. రాంచరణ్ లాంటి పెద్ద కమర్షియల్ హీరో చెవిటి వాడిగా చేసి మెప్పించడం, భారీగా హీరో ఇంట్రడక్షన్ సీన్లు లేకుండా సినిమా తీసి ప్రేక్షకులను ఒప్పించడం గొప్ప మార్పు. అలాగే హీరోయిన్ ఓరియెంటెడ్ మహానటి చిత్రంలో ఒక హీరోయిన్ ప్రధాన పాత్ర పోషించడం, ప్రముఖ నటులంతా గెస్ట్ పాత్రలకు పరిమితం కావడం చాలా గొప్ప విషయం.

మనం వెనుకబడి ఉన్నాం..

మనం వెనుకబడి ఉన్నాం..

ప్రేక్షకులకు ఏమి కావాలో తెలుసుకొని ఇప్పుడిప్పేడే దర్శకులు అలాంటి సినిమాలు అందించే ప్రయత్నం జరుగుతున్నది. తెలుగు సినిమా పరిశ్రమకు మంచి సంకేతమని భావించవచ్చు. తమిళ, మలయాళం పరిశ్రమ పరిశ్రమలను పోల్చుకొంటే విభిన్నమైన చిత్రాలను అందించడంలో మనం వెనుకబడి ఉన్నాం.

ప్రేక్షకులను వెధవలు చేయలేం

ప్రేక్షకులను వెధవలు చేయలేం

ఇటీవల నాతో నాగార్జున అక్కినేని మాట్లాడుతూ.. ప్రేక్షకులను వెధవలను చేసే రోజులు పోయాయి. ఆడియెన్స్‌ను అలా చేస్తున్నామని తెలిసిన పది నిమిషాలకే వారు లేచిపోతున్నారు. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు తీస్తే ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది అని చెప్పడానికి రంగస్థలం, మహానటి చిత్రాలు ఉదాహరణ అని అన్నారు.

హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు

హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు

హీరోలు కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు ప్రేక్షకులు ఆదరిస్తారడానికి మహానటి, హిందీలో రాజీ, వీర్ ది వెడ్డింగ్ చిత్రాలు చక్కటి ఉదాహరణ. హీరోయిన్లు అంటే హీరో ప్రేమ కోసం వెంపర్లాడే రోజులు పోయాయి. హీరోయిన్లను మంచి చూపిస్తే ఫ్యామిలీ ఆడియెన్స్, మహిళలు ఎక్కువ మంది వచ్చి చూస్తారు. మహానటి చిత్రంలో కీర్తీ సురేష్ మినహాయించి మిగితా అన్ని పాత్రలు ముఖ్యంగా మహిళా నటుల రోల్స్ చాలా బాగుంటాయి. అందుకే ఆ చిత్రానికి మహానటికి ప్రేక్షకాదరణ పొందింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X