అమ్మమ్మగారిల్లు.. టీజర్ రిలీజ్ డేట్!
ఛలో చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న నాగశౌర్య తన తదుపరి చిత్రాల్లో ఉత్సహంగా నటిస్తున్నాడు. నాగశౌర్య కెరీర్ కు ఆవసరమైన హిట్ ఛలో చిత్రం ద్వారా లభించింది. ప్రస్తుతం నాగశౌర్య నటిస్తున్న చిత్రం అమ్మమ్మగారిల్లు. నాగశౌర్య నుంచి రాబోతున్నా మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రం ఇది. సుందర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తునారు.
ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సుమన్, రావు రమేష్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 22 టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఛలో చిత్రం విజయం సాధించడంతో ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఓయ్ ఫేమ్ షాలిని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం. ఫ్యామిలీ ఎమోషన్స్, హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనునట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











