Rangabali Trailer Released: రంగబలి ట్రైలర్ రిలీజ్.. దసరా విలన్ తో తలపడనున్న నాగశౌర్య

టాలీవుడ్‌ యంగ్ హీరో నాగశౌర్యకు గత కొంత కాలంగా సరైన హిట్స్ పడటం లేదు. ఆయన నటించిన చివరి చిత్రం ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి.. బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం నాగశౌర్య నటిస్తున్న చిత్రం రంగబలి. ఈ సినిమాతో పవన్‌ బసంశెట్టి డైరెక్టర్‌ గా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ కు మంచి స్పందన రాగా.. ఇప్పుడు తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే...

Rangabali Trailer Released

మాస్ కమర్షియల్ కథతో...: ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలు చేయడంలో ముందుంటాడు నాగశౌర్య. కెరియర్ మొదటి నుంచి... లవ్, కామెడీ, ఎంటర్ టైనర్ సినిమాలే చేస్తూ వచ్చాడు. గత ఏడాది... కృష్ణ వ్రింద విహారిగా పలకరించిన నాగశౌర్య... ఇక ఈ ఏడాది ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాతో వచ్చాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా అలరించలేక పోయింది. అయితే ఇప్పుడు రంగబలి అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా మాస్ కమర్షియల్ కథగా వస్తోందని అర్థం అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, పాటలు ఆకట్టుకుంటున్నాయి.

Rangabali Trailer Released

ఆకట్టుకుంటున్న రంగబలి ట్రైలర్:ఇదిలా ఉంటే... తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ అయి ఆకట్టుకుంటుంది. ట్రైలర్ చూస్తుంటే సినిమాని యాక్షన్ అండ్ కామెడీతో బ్యాలన్స్ చేస్తూ దర్శకుడు సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తుంది. మూవీలో కమెడియన్ సత్య మరియు హీరో మధ్య వచ్చే సీన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. బయట ఊరిలో ఎలా ఉన్నా పర్వాలేదు.... సొంత ఊరిలో మాత్రం సింహంలా ఉండాలనే ఆలోచన ఉన్న హీరో.. ఆ ఊరిలోనివిలన్ ని ఎలా ఎదురుకున్నాడు అనేదే సినిమా కథ అని ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతుంది.

Rangabali Trailer Released

విలన్ గా షైన్ టామ్ చాకో:కాగా ఈ సినిమా విషయానికి వస్తే... రంగబలి చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్‌ గా నటిస్తోంది. ప్రస్తుతం రంగబలి షూటింగ్‌ దశలో ఉంది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంస్థ చిత్రాన్ని నిర్మించింది. అంతేకాదు దసరా సినిమాలో విలన్ గా చేసిన షైన్ టామ్ చాకో ఈ మూవీలో కూడా విలన్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు పవన్ బసంశెట్టి డైరెక్ట్ చేస్తున్నాడు. పవన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్ లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడు.

నాగశౌర్యకు రంగబలి హిట్: రంగబలి చిత్రాన్ని జూలై 7వ తేదీన రిలీజ్ చేయనున్నారు. నాగశౌర్య మరోవైపు నారి నారి నడుమ మురారి, పోలీస్‌ వారి హెచ్చరిక సినిమాలు చేస్తుండగా.. చిత్రీకరణ దశలో ఉన్నాయి. రంగబలి సినిమా హిట్ అవుతుందని.. నాగశౌర్యతో పాటు అభిమానులు అంచనాలు పెంచుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X