వెంకటేష్ 'నాగవల్లి' హారర్ చిత్రం కాదు
"ట్రైలర్స్ చూసిన వాళ్ళందరూ 'నాగవల్లి' హారర్ తరహా చిత్రమని అనుకుంటున్నారు. ఇది సకుటుంబంగా చూడదగ్గ చిత్రం" అంటున్నారు బెల్లంకొండ సురేష్. పి.వాసు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఆయన నిర్మించిన నాగవల్లి చిత్రం డిసెంబర్ 16న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో ఆయన ముచ్చటిస్తూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే నాగవల్లి చిత్రం కోసం వెంకటేష్ ఎంతో తపించారు. ఆయన నిర్మాతల హీరో. ఇందులో ఆయన పాత్ర ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేస్తుంది. రాజు వేషధారణలోని వెంకటేష్‌ని చూసి ప్రేక్షకులు, ఆయన అభిమానులు చాలా బాగుందని చెబుతున్నారు.
ఇందులో ఐదుగురు హీరోయిన్స్ ఉన్నారు. వారిలో ఎవరు నాగవల్లి, ఎవరు హీరోయిన్ అని అడుగుతున్నారు. సినిమా చూశాక హీరో, హీరోయిన్..అని ఎక్కడా విడదీసి మాట్లాడలేం. ఇందులో మనకు కనిపించే ప్రతిదీ ఒక పాత్ర. రజనీకాంత్ నటించిన 'చంద్రముఖి' ఏ మాత్రం అంచనాల్లేకుండా విడుదలైంది. మా సినిమా 'నాగవల్లి'పై చాలా అంచనాలున్నాయి. వాటిని అందుకొనేలా తీర్చిదిద్దాం అన్నారు. 'నాగవల్లి' చిత్రాన్ని హిందీలోనూ తెరకెక్కించే ఆలోచనలు ఉన్నాయన్నారు.
ఇక ఈ పీరియాడిక్ ధ్రిల్లర్ లో వెంకటేష్ వృధ్దుడు గెటప్ లో కూడా కనిపించనున్నారు. ఈ సీక్వెల్ ప్రారంభంలోనే చంద్రముఖి ఫొటోని ఒక పాపకు గిప్ట్ గా ఇవ్వటంతో కథ ప్రారంభమవుతుంది. హర్రర్ జనర్ గా రూపొందే ఈ చిత్రంలో వెంకటేష్..ముసలి గెటప్ లోనూ కనపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది.బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. అలాగే ఈ చిత్రంలో అనూష్కతో పాటు కమలినీ ముఖర్జీ, శ్రద్ధాదాస్, పూనమ్ కౌర్, రిచా గంగోపాధ్యాయ వెంకీతో ఆడిపాడతారు సాంకేతికంగా ఉన్నత విలువలతో తీర్చిదిద్దుతున్న ఈ చిత్రంలో 'లక లక లక లక' డైలాగుని 'లీడర్' చిత్రంతో పరిచయమైన రిచా గంగోపాధ్యాయ చెప్తోంది.


Click it and Unblock the Notifications











