అప్పుడే వెంకటేష్ ‘నాగవల్లి’ చీరలు రెడీ

By Srikanya

వెంకటేష్‌ తాజా చిత్రం 'నాగవల్లి" రిజల్ట్ మాటెలా ఉన్నా ఆ చిత్రం పేరు చెప్పి మార్కెట్లోకి చీరలు మాత్రం వచ్చేసాయి. 'చంద్రముఖి"కి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రంలో ఐదుగురు హిరోయిన్స్(అనుష్క, రిచా గంగోపాధ్యా, కమలినీ ముఖర్జీ, స్రద్ధాదాస్‌,, పూనమ్‌కౌర్) నటించారు. వీరందరి కోసం విభిన్నంగా చీరలను డిజైన్‌ చేయించి వాడారు. ఈ చీరలను మార్కెట్లోకి విడుదల చేస్తే మహిళల‌ని విపరీతంగా ఆకట్టుకుంటాయని భావించిన కళామందిర్‌ ఈ చీరలను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు.

కళామందిర్‌ అన్ని బ్రాంచిల్లోనూ ఈ చీరలు దొరుకుతాయని పబ్లసిటీ చేస్తున్నారు.అలాగే ఈ చీరలకు 'నాగవల్లి" అని పేరు పెట్టారు. సినిమాలో ఈ 5గురు కట్టిన సేమ్‌ డిజైన్స్‌లోనే 'నాగవల్లి" చీరలు కూడా డిజైన్‌ చేయించి వదిలారు. కానీ నాగవల్లి ఫెయిల్యూర్ దెబ్బ ఈ చీరల మార్కెటింగ్ పై పడుతోందని అంటున్నారు. హిట్ అయితే ఆ డిమాండ్ వేరేగా ఉండేదని, ఇప్పుడు ఈ చీరలు ఫలానా అని చెప్పి మరీ అమ్మాల్సివస్తోందని వాపోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X