Just In
- 28 min ago
టీవీ షోలకు ఎక్కువ, జనానికి తక్కువ సమయం.. రోజాకు జాఫర్ దిమ్మతిరిగే ప్రశ్న
- 1 hr ago
చంద్రబాబును పొగిడిన రాజశేఖర్.... జగన్‌కు మరో సారి హ్యాండ్.. రూలర్ ఈవెంట్లో ఆసక్తికర కామెంట్లు
- 2 hrs ago
గొల్లపూడి భౌతిక కాయానికి నివాలి : అది నా దురదృష్టం.. చిరు కన్నీటి వీడ్కోలు
- 3 hrs ago
జై బాలయ్య అనే వరకు వదల్లేదు.. బోయపాటిని విసిగించిన నందమూరి ఫ్యాన్స్
Don't Miss!
- News
మీ ఆతిథ్యం అమోఘం: దేవసేనకు గవర్నర్ తమిళిసై ప్రశంసలు
- Sports
న్యూజిలాండ్ సిరీస్‌కు భువనేశ్వర్ అనుమానమే.. ఐపీఎల్‌తో పునరాగమనం?!!
- Finance
విద్యా రుణాలు తగ్గుతున్నాయ్... కారణాలు ఏమిటో తెలుసా?
- Technology
టిక్‌టాక్ మరో సంచలనం, మ్యూజిక్ యాప్ వస్తోంది
- Lifestyle
అంతర్జాతీయ ‘టీ‘ దినోత్సవం 2019 : ఆ ‘టీ‘ తాగితే మీ భాగస్వామిని బాగా సుఖపెట్టొచ్చు...
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
రోజాతో సమస్యే లేదు.. పర్సనల్ అటాక్ చేస్తే అస్సలు ఊరుకోను.. నాగబాబు కామెంట్స్
రోజా, నాగబాబు.. ఈ ఇద్దరిదీ జబర్దస్త్ జోడీ అని ప్రత్యేకంగా చెప్పాలా!. జబర్దస్త్ జడ్జ్మెంట్ ఇవ్వడంలో ఈ ఇద్దరినీ మించిన జడ్జెస్ ఉండరనే చెప్పుకోవాలి. బుల్లితెరపై జడ్జ్ స్థానంలో కూర్చొని కూడా తమ నవ్వులతో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేయగల సమర్థులు వీరు. అలాంటి ఈ ఇద్దరి గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. పైగా ఆ విషయాన్ని నాగబాబు స్వయంగా పేర్కొనడం హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఏంటా విషయం? వివరాల్లోకి పోతే..

పార్టీలు వేరు కానీ.. జబర్దస్త్ జోడీ
బుల్లితెర వినోదాలు పంచుతూనే రాజకీయాలతో కూడా బిజీగా ఉంటారు రోజా, నాగబాబు. ఈ జబర్దస్త్ జోడీ పార్టీలు వేరు వేరు అయినప్పటికీ పక్కపక్కనే కూర్చొని ఆ విషయాన్నే మరచి నవ్వుల లోకంలో మునిగిపోతుండటం చూస్తుంటాం. అయితే ఈ మధ్యకాలంలో నగరి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా.. వైసీపీ పార్టీలో చురుకుగా ఉంటోంది.

జనసేనానితో నాగబాబు.. చర్చలకు కారణం
ఇక నాగబాబు విషయానికొస్తే.. తమ్ముడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. జనసేన పార్టీ కూడా ఊహించని రీతిలో పరాజయం పాలైంది. అయినప్పటికీ తన పోరాటాన్ని ఆపని పవన్.. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేరిన వైసీపీని, ఆ పార్టీ పాలనను ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ రోజా, నాగబాబు అంశం చర్చల్లో నిలిచింది.

పవన్ కళ్యాణ్‌పై రోజా విమర్శలు.. నాగబాబు ప్రశ్న
దీంతో ఈ విషయమై ఇటీవల యూ ట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన నాగబాబు వివరణ ఇచ్చారు. ఈ మేరకు తనకు రోజాతో ఉన్న రిలేషన్ గురించి చెప్పారు. రోజా వైసీపీలో ఉంది కదా!. ఆమె అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఆమె పక్కనే కూర్చుని జబర్దస్త్‌లో ఎలా నవ్వుతూ కూర్చొని జడ్జిమెంట్ ఇస్తున్నారు. అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుందనే ప్రశ్న నాగబాబుకు ఎదురైంది.

రోజా, నేను కేవలం అలా మాత్రమే
దీనిపై ఎంతో కూల్‌గా సమాధానం చెప్పిన నాగబాబు.. జబర్దస్త్ షో లో రోజా, నేను కేవలం ప్రొఫెషనల్‌గా మాత్రమే ఆలోచిస్తామని, అక్కడ తమని జడ్జిమెంట్ చెప్పమని పిలిచారని.. తమ రిలేషన్ అంత వరకే ఉంటుందని చెప్పారు. రోజాపై కూడా తనకు ఎలాంటి కంప్లైంట్స్ ఉండవని, ప్రొఫెషనల్‌గా అసలు రియాక్షన్స్ అనేవే ఉండవని నాగబాబు అన్నారు.

రోజాతో సమస్యే లేదు.. కౌంటర్ ఇస్తా
రాజకీయం వేరు, షో వేరు కాబట్టి రోజాతో తనకు సమస్యే లేదని అన్నారు నాగబాబు. ఒకవేళ పర్సనల్ అటాక్‌కు దిగితే మాత్రం కౌంటర్ వేస్తానని అన్నారు. జబర్దస్త్‌లో ఉన్నంత సేపు తామిద్దరం ప్రొఫెషనల్‌గానే ఉంటామని చెప్పుకొచ్చారు నాగబాబు.