అన్నయ్యను ఆ మాట అనక తప్పలేదు.. కానీ చిరు లైట్ తీసుకున్నారు.. సీక్రెట్ రివీల్ చేసిన నాగబాబు

మెగా ఫ్యామిలీ హీరోల్లో ముగ్గురికి ముగ్గురు ప్రత్యేకమే. ఆ ముగ్గురు మొనగాళ్లే చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్. ఈ ముగ్గురూ ఒకరంటే ఒకరు ప్రాణానికి ప్రాణంగా ఉంటూ అన్నదమ్ముల బంధానికి చిరునామా అనేలా వ్యవహరిస్తుంటారు. తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్.. అన్నయ్య చిరంజీవి పట్ల ఎంతో ఆప్యాయంగా ఉంటారు. కాగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పారు నాగబాబు. వివరాల్లోకి పోతే..

వెండితెర, బుల్లితెర బ్యాలెన్స్ చేస్తూ..

వెండితెర, బుల్లితెర బ్యాలెన్స్ చేస్తూ..

వెండితెరతో పాటు బుల్లితెర ప్రేక్షకులకు వినోదాల విందు పంచుతూ జబర్దస్త్ చేస్తున్నారు నాగబాబు. అన్నయ్య చిరంజీవితో పాటు సినిమాల్లో రాణిస్తూనే మెగా ఫ్యామిలీకి సంబంధించిన కీలక వ్యవహారాలను లీడ్ చేస్తుంటారు నాగబాబు. వ్యక్తిగతంగా వెండితెర, బుల్లితెర రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే గాక అన్నయ్య చిరంజీవికి, తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి సహాయ సహకారాలు అందిస్తుంటారు నాగబాబు.

 చిరంజీవితో ఇబ్బంది కలిగింది.. చివరకు ఆ పరిస్థితి

చిరంజీవితో ఇబ్బంది కలిగింది.. చివరకు ఆ పరిస్థితి

ఈ నేపథ్యంలో మీడియా చానల్‌తో ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఏ విషయంలోనైనా తనకు అన్నయ్య చిరంజీవి మాత్రమేస్ఫూర్తి అని చెప్పే నాగబాబు.. ఓ సినిమా విషయంలో అన్నచిరంజీవితో నటించడానికి చాలా ఇబ్బంది పడ్డానని, చివరకు తన వల్ల కాదని దర్శకనిర్మాతలతో చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు.

 ఒరేయ్ అనక తప్పలేదు

ఒరేయ్ అనక తప్పలేదు

చిరంజీవి హీరోగా వచ్చిన అంజి చిత్రంలో చిరంజీవితో పాటు నాగబాబు కూడా నటించారు. ఈ సినిమాలో చిరంజీవి పెద్దయ్య పాత్రలో నాగబాబు నటించారు. అయితే ఈ సినిమాలో కొన్ని సందర్భాల్లో చిరంజీవిని ఒరేయ్, ఏరా అని పిలవాల్సి వచ్చినదని.. ఆ సందర్బంలో తాను పడిన ఇబ్బంది అంతాఇంతా కాదని చెప్పారు నాగబాబు.

అన్నయ్యే స్వయంగా వచ్చి చెప్పడంతో..

అన్నయ్యే స్వయంగా వచ్చి చెప్పడంతో..

అన్నయ్యను అలా అనడం నా వల్ల కాదని ఆ సినిమా దర్శకనిర్మాతలతో చెప్పానని, అయితే వాళ్ళు చిరంజీవితో కూడా చెప్పడంతో ఆయన లైట్ తీసుకున్నారని చెప్పారు నాగబాబు. అన్నయ్యే స్వయంగా వచ్చి మనం సినిమాలో నటిస్తున్నాం.. పర్వాలేదు అనేసెయ్ అని చెప్పడంతో ఆ మాటలు అనక తప్పలేదని నాగబాబు అన్నారు.

చిరంజీవితో త్రిష..

చిరంజీవితో త్రిష..

ఇటీవలే సైరా నరసింహా రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి తన 152 వ సినిమాను కొరటాలశివ దర్శకత్వంలో చేస్తున్నారు. నవంబర్ నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది. చిత్రంలో చిరు సరసన త్రిష పేరును పరిశీలనలో పెట్టినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X