చిరు బర్త్ డే: లక్ష మొక్కల కార్యక్రమంలో నాగబాబు (ఫోటోస్)
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ లోని మణికొండ ఓయూ కాలనీలో గురువారం ఉదయం ఈ కార్యక్రమాన్ని చిరంజీవి సోదరుడు నాగబాబు తొలి మొక్కను నాటి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నాగబాబుతో పాటు సినీ నటుడు కృష్ణుడు కూడా పాల్గొన్నారు. చిరంజీవి అభిమాన సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగనుంది. హైదరాబాద్ నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో లక్ష మొక్కలు నాటనున్నారు. వృక్షో రక్షతి రక్షిత: అనే నినాదంతో ఈ లక్ష మొక్కలు నాటే కార్యక్రమం సాగనుంది.
స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు...

లక్ష మొక్కలు నాటే కార్యక్రమం
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

మొక్క నాటుతున్న నాగబాబు
లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో తొలి మొక్కను నాటుతున్న చిరంజీవి సోదరుడు నాగబాబు

కృష్ణుడు
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రారంభమైన లక్ష మొక్కల కార్యక్రమంలో మొక్కను నాటు తున్న కృష్ణుడు

అభిమానుల ఆధ్వర్యంలో
చిరంజీవి అభిమానుల ఆధ్వర్యంలో ఈ లక్ష మొక్కల కార్యక్రమం జరుగనుంది.


Click it and Unblock the Notifications











