twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇదే టైమ్ అని కొందరి ప్లాన్! సగం నాలెడ్జ్.. గాలి వార్తలు.. నాగబాబు జబర్దస్త్ రియాక్షన్

    |

    ముక్కుసూటిగా మాట్లాడటం, ఎవరేమనుకున్నా సరే చెప్పాలనుకున్నది ఓపెన్ చెప్పేయడం కొందరిలో మాత్రమే ఉండే మంచి లక్షణం. సినీ ఇండస్ట్రీ విషయానికొస్తే అలా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తుల్లో ఒకరు మెగా బ్రదర్ నాగబాబు. అనునిత్యం యాక్టివ్‌గా ఉంటూ సమాజంలో జరిగే అన్ని విషయాలపై స్పందించే నాగబాబు.. తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జబర్దస్త్ రియాక్షన్ ఇచ్చారు. వివరాల్లోకి పోతే..

    మై ఛానెల్ నా ఇష్టం..

    మై ఛానెల్ నా ఇష్టం..

    ఏ విషయంపై అయినా స్వేచ్ఛగా తన అభిప్రాయం చెప్పేందుకు గాను 'మై ఛానెల్ నా ఇష్టం' పేరుతో నాగబాబు సొంతంగా ఓ యు ట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఛానల్ ద్వారా ఇప్పటికే ఎన్నో విషయాలు ప్రస్తావించిన మెగా బ్రదర్.. ఇప్పుడు కరోనా వ్యాప్తి, నివారణ చర్యల గురించి పేర్కొంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

    విజృంభిస్తున్న కరోనా.. యావత్ మానవాళి ఆందోళన

    విజృంభిస్తున్న కరోనా.. యావత్ మానవాళి ఆందోళన

    చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా యావత్ మానవాళిని వణికిస్తోంది. ఇప్పటికే 195 దేశాల్లో పాగా వేసిన ఈ వైరస్ భారత దేశంలో విజృంభిస్తుండటం జనాల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఇండియాలో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 490కి చేరడంతో జనం కంగారు పడుతున్నారు.

    జనతా కర్ఫ్యూ.. అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్

    జనతా కర్ఫ్యూ.. అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్

    ఈ నేపథ్యంలో కరోనా కట్టడి చేసేందుకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మొన్న కేంద్రం జనతా కర్ఫ్యూ విధించగా, ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ ఆదేశాలు జారీ చేశాయి. ఈ పరిస్థితుల్లో పలువురు సెలబ్రిటీలు కరోనా పట్ల జాగ్రత్తలు వివరిస్తుండగా.. తాజాగా ఈ ఇష్యూపై నాగబాబు స్పందిస్తూ ట్వీట్ చేశారు.

    నాగబాబు ట్వీట్.. వీడియో పోస్ట్ చేస్తూ!

    నాగబాబు ట్వీట్.. వీడియో పోస్ట్ చేస్తూ!

    కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు యావత్ భారతదేశ ప్రజలు స్వచ్ఛందంగా నిన్న ‘జనతా కర్ఫ్యూ' పాటించిన విషయం తెలిసిందే. ఈ జనతా కర్ఫ్యూను విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ నాగబాబు ట్వీట్ చేశారు. ఈ మేరకు వైద్యులు, వైద్య సిబ్బందికి, పోలీసులు, అధికారులకు తన హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలుపుతూ వీడియో పోస్ట్ చేశారు.

    కొందరు తమ పాపులారిటీ కోసం ఇలా..

    కొందరు తమ పాపులారిటీ కోసం ఇలా..

    కుల, మత, జాతి, డబ్బు అనే తారతమ్యం లేకుండా అందరూ స్వచ్చందంగా ‘జనతా కర్ఫ్యూ' లో భాగం కావడం ఆనందంగా ఉందని అన్నారు నాగబాబు. కరోనా పట్ల ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పని లేదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఇదే టైమ్ అని కొందరు తమ పాపులారిటీ కోసం రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారని, ఎవ్వరూ పానిక్ కావొద్దని చెప్పారు.

    Recommended Video

    Anupam Kher Vs Naseeruddin Shah || Anupam Kher Slams Naseeruddin Shah ||

    ఇది ప్రపంచానికి అంతం కాదు.. అవన్నీ గాలి వార్తలు

    నిరాశ, నిస్పృహల నుండి బయటకి రావాలని అన్నారు. భయం వద్దని చెప్పారు. ఇది ప్రపంచానికి అంతం కాదని అన్నారు. కరోనాను కట్టడి చేసే పరిస్థితులు మనందరి చేతిలో ఉన్నాయని నాగబాబు అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న గాలి వార్తలు, కొన్ని మీడియాలు సగం నాలెడ్జ్ తో ఇస్తున్న వార్తలు చూసి భయపడకండి అంటూ ధైర్యం చెప్పారు మెగా బ్రదర్.

    English summary
    CoronaVirus entered in Hyderabd. Now mega brother Nagababu commented on this virus using social media platform.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X