పబ్లిక్‌గా చెబుతున్నా.. గెటప్ శ్రీనుని వదిలితే..! నాగబాబు షాకింగ్ కామెంట్స్

మెగా బ్రదర్ నాగబాబు తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో జబర్దస్త్ కమెడియన్ గురించి మాట్లాడారు. ఆయన్ను ఆకాశానికెత్తుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. పైగా ఇన్నాళ్లకు పబ్లిక్‌లో ఇలా ఇతని గురించి మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి చెబుతున్నా అంటూ అయన అభిప్రాయం చెప్పేశారు. ఇంతకీ నాగబాబు ఎవరి గురించి కామెంట్ చేశారు. ఆ వివరాలేంటి? వివరంగా చూద్దామా..

ఎంతోమంది కళాకారులు ఫేమస్

ఎంతోమంది కళాకారులు ఫేమస్

బుల్లితెర ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కళాకారులు ఫేమస్ అయ్యారు. కడుపుబ్బా నవ్వించే స్కిట్స్ వేస్తూ బుల్లితెర ఆడియన్స్‌ని గిలిగింతలు పెడుతూ తమ కెరీర్‌కి సరికొత్త బాటలు వేసుకుంటున్నారు. రోజుకో కొత్త రకం స్కిట్.. అప్‌డేట్ నవ్వులు అన్నట్లుగా సాగుతోంది జబర్దస్త్ షో. అయితే జబర్దస్త్ పార్టిసిపెంట్స్‌లో చాలామంది వెండితెరపై కాలుమోపడం చూస్తూనే ఉన్నాం.

కళాకారులపై నాగబాబు జబర్దస్త్ కామెంట్స్

కళాకారులపై నాగబాబు జబర్దస్త్ కామెంట్స్

సుడిగాలి సుధీర్, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను ఇలా చాలామంది తమ తమ టాలెంట్ చూపిస్తూ వెండితెరపై కాలుమోపారు. సిల్వర్ స్క్రీన్‌పై వీరి సక్సెస్, ఫెయిల్యూర్ సంగతి అటుంచితే.. అక్కడ కూడా కడుపుబ్బా నవ్వించడంలో విజయం సాధిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ పార్టిసిపెంట్స్‌ని ఉద్దేశిస్తూ తనదైన స్టైల్‌లో కామెంట్స్ చేశారు నాగబాబు.

త్రీ మంకీస్.. ఇలాంటి వారు

త్రీ మంకీస్.. ఇలాంటి వారు

ప్రస్తుతం 'త్రీ మంకీస్' అనే పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీనులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ప్రెస్ మీట్‌ నిర్వహించారు. అందులో భాగంగా నాగబాబు మాట్లాడుతూ.. సుధీర్‌, రాంప్రసాద్‌, గెటప్ శ్రీనులపై తన అభిప్రాయం చెప్పారు.

టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు.. కానీ అందులో

టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు.. కానీ అందులో

జబర్దస్త్‌లో ఎందరో టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారని, వారిలో తనకు బాగా ఇష్టమైనవారు సుధీర్, రాం ప్రసాద్, గెటప్ శ్రీను అని చెప్పారు నాగబాబు.
పంచ్‌ డైలాగ్స్ బాగా రాసే మంచి రైటర్ రాంప్రసాద్‌ అని, ఓ హీరోకు ఉండాల్సిన అన్ని క్వాలిటీలు రాంప్రసాద్‌కు ఉన్నాయని ఆయన చెప్పారు. ఇక గెటప్ శ్రీను గురించి చెప్పాలంటే.. జబర్దస్త్‌లో తాను బాగా అభిమానించే వ్యక్తి గెటప్ శ్రీను అని చెప్పారు నాగబాబు.

ఇప్పుడు చెబుతున్నా ఏ భాషలోనైనా సరే..

ఇప్పుడు చెబుతున్నా ఏ భాషలోనైనా సరే..

గెటప్ శ్రీను గురించి పబ్లిక్‌లో చెప్పడానికి ఇప్పటిదాకా అవకాశం రాలేదని పేర్కొన్న నాగబాబు.. ఇప్పుడు చెబుతున్నా ఏ భాషలోనైనా సరే.. అంతర్జాతీయ స్థాయిలో నటించగలిగే ఏకైక నటుడు గెటప్ శ్రీను అని అన్నారు. ఎంత గొప్ప నటుడంటే అతను ఇప్పటికే 90 రకాల క్యారెక్టర్స్ చేసి అద్భుతమైన కామెడీ పండించాడని అన్నారు నాగబాబు.

అతన్ని ఉపయోగించుకోకపోతే.. కోల్పోయినట్లే

అతన్ని ఉపయోగించుకోకపోతే.. కోల్పోయినట్లే

ఎంతటి కష్టమైన టాస్క్ ఇచ్చినా గెటప్ శ్రీను ఇట్టే చేసేస్తాడని, ఆయనకు పోటీగా ఎవ్వరూ నటించలేరని పేర్కొంటూ గెటప్ శ్రీనుని ఆకాశానికెత్తారు మెగా బ్రదర్. ఇప్పటివరకు ఇండస్ట్రీలో శ్రీనుకు రావాల్సిన గుర్తింపు ఎందుకు రాలేదో నాకు తెలియదు కానీ.. తెలుగు చిత్ర పరిశ్రమ అతన్ని ఉపయోగించుకోకపోతే ఓ ఆణిముత్యాన్ని కోల్పోతామని నాగబాబు చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X