»   » ఈ ట్రైలర్ మీ మనసును టచ్ చేస్తుంది...తీసింది మనోడే!

ఈ ట్రైలర్ మీ మనసును టచ్ చేస్తుంది...తీసింది మనోడే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మన హైదరాబాద్‌కు చెందిన ఫిల్మ్ మేకర్ నగేష్ కుకునూర్ తెరకెక్కిస్తున్న బాలీవుడ్ మూవీ 'ధనక్' చిత్రానికి సంబంధించని ట్రైలర్ ఈ రోజు రిలీజైంది. సినిమా కాన్సెప్టు ఏమిటో ట్రైలర్లో తెలిసిపోతుంది. ట్రైలర్ అద్భుంగా ఉంది...ఈ సినిమా మీ మనసుటచ్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

హ్యూమన్ ట్రయాలజీ సినిమాలో తీయడంలో నగేష్ కుకునూర్‌ది అందెవేసిన చేయి. గతంలో ఆయన 'దూర్', 'ఇక్భాల్' లాంటి అవార్డు విన్నింగ్ సినిమాలు చేసారు. తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం 'ధనక్'. ఈ ట్రైలర్‌కు ప్రముఖుల నుండి ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా షారుక్ ఖాన్ బెస్ట్ విషెస్ చెబుతూ ట్వీట్ చేసారు.

'ధనక్' చిత్రం కథ...రాజస్థాన్ ప్రాంతానికి చెందిన అంధుడైన 8 ఏళ్ల బాలుడు చోటు, అతని 10 ఏళ్ల సోదరి పారి చుట్టూ తిరుగుతుంది. పారినే అతని కళ్లు, అతని బెస్ట్ ఫ్రెండ్ కూడా. 9 ఏళ్లు వచ్చే సమయానికి నువ్వు ఈ లోకాన్ని చూడగలుగుతావు అని తన తమ్ముడికి చెబుతుంది పారి. పారి అభిమాన నటడు షారుక్ ఖాన్. ప్రజలను నేత్రదానం చేయాలని షారుక్ కోరిన ఓ యాడ్ చూసిన పారి...తన తమ్ముడికి చూపు తేవడం షారుక్ వల్ల మాత్రమే అవుతుందిన భావిస్తున్నారు. మరి చోటుకు చూపు తేవడానికి పారి ఏం చేసింది, షారుక్‌ను కలవడానికి ఈ ఇద్దరు చిన్నారులు ఎంత కష్టపడ్డారు? అనేదే సినిమా.

ఈ చిత్రానికి రచన దర్శకత్వం నగేష్ కుకునూర్. చోటు, పారి పాత్రల్లో క్రిష్ చాబ్రియా, హేటల్ గడ నటిస్తున్నారు. విపిన్ శర్మ, గుల్ఫమ్ ఖాన్ ఇరత్ పాత్రల్లో నటిస్తున్నారు. జూన్ 10న విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రాన్ని మనీష్ ముంద్రా, నగేష్ కుకునూర్, ఎలాహె హిప్టూలా నిర్మిస్తున్నారు.

Nagesh Kukunoor’s Dhanak trailer

నగేష్ కుకునూర్ గురించి కొంత...
హైదరాబాద్ లో పుట్టి పెరిగిన నగేష్ కుకునూర్ నాయుడు ఉస్మానియా యూనివర్శిటీ నుండి కెమికల్ ఇంజనీరింగులో పట్టభద్రుడయ్యాడు. తర్వాత అమెరికా వెళ్లి ఎంఎస్ చేసి టెక్సాస్ లో ఉద్యోగంలో చేరాడు. చిన్నతనం నుండి నగేష్ కు సినిమాలంటే ఆసక్తి. ఆ ఆసక్తితోనే అట్లాంటాలో యాక్టింగ్, డైరెక్షన్ కోర్సు చసారు. అనంతరం సినిమా రంగంలోకి వచ్చారు. పలువు అవార్డు విన్నింగ్ సినిమాలు తీసారు.

English summary
The trailer of Nagesh Kukunoor’s internationally acclaimed ‘Dhanak’ released today creating an instant buzz online. With 'Dhanak', the noted filmmaker completes his humane trilogy after his award-winning films, ‘Dor’ and ‘Iqbal’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu