వివాదాస్పద దర్శకుడుతో రవితేజ ఖరారు
ఇక రవితేజ ప్రస్తుతం 'సార్ వస్తారు' టైటిల్ తో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. పరుసరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. కాజల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే మరో హీరో నారా రోహిత్ స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఆ పాత్ర కథను కీలకమైన మలుపు తిప్పనుందని తెలుస్తోంది. గతంలో పరుసరామ్,నారా రోహిత్ కాంబినేషన్ లో సోలో అనే చిత్రం రూపొందింది. ఈ అనుబంధంతో ఈ ప్రత్యేక పాత్రకు నారా రోహిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
అలాగే రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'బలుపు' చిత్రం రూపొందుతోంది. పివిపి సినిమా బేనర్ పై గతంలో రవితేజతో వీడింతే చిత్రం రూపొందించిన ప్రసాద్ వి.పొట్లూరి 'బలుపు' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీర సినిమా దగ్గర నుంచి రవితేజ సినిమాలన్నీప్లాపులే. దీంతో రవితేజ సినిమాలంటే ప్రేక్షకుల్లో క్రేజ్ కూడా తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో తన కెరీర్ ప్రమాదంలో పడిపోతుందనే విషయం గ్రహించిన రవితేజ ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. త్వరలో రవితేజ తన 'బలుపు' చూపించడానికి రెడీ అవుతున్నాడు.


Click it and Unblock the Notifications












