హీరోయిన్స్ ని టచ్ చేయలేదా? అంటే..అక్కినేని నాగేశ్వరరావు
టచ్ అంటే..నేను అవకాశం ఉండీ అంటుకోలేదు. పైగా పాపులారిటీ. ఎప్పుడైనా ఆశపుట్టినా, మనసు లాగినా..మన కెరీర్ ఏమవుతుంది? అమ్మకిచ్చిన మాట ఏమవుతుంది? నలుగురూ ఏమనుకుంటారన్న భయం ఉంటుంది...అంటూ తన హీరోయిన్స్ ని టచ్ చేయలేదంటూ ఎవర్‌గ్రీన్ హీరో అక్కినేని నాగేశ్వరరావు ఓ టీవీ ఛానెల్ కి ఆదివారం రాత్రి ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు. ఆయన సూటిగా మాట్లాడుతూ..నాలో కృష్ణుడి భావాలున్నాయి, రామచంద్రుడి లక్షణాలున్నాయి. నేను ఊహల్లో కూడా ఈ అమ్మాయి భలే బాగుంటుంది అనుకోకుండా లేను. అలా చెప్పను. ఎవరైనా చెప్పినా అది హిపోక్రసీ అంతే. నాకు ఎవరిమీదైనా కోరిక కలిగినా ఎక్కడకు తీసుకెళ్లగలను? అందరూ గుర్తుపడతారు కాబట్టి మాలాంటి వాళ్లకు తప్పులు చేయడం కూడా కుదరదు. కలలో కూడా ఎరగం అంటే మాత్రం మేం శుద్ధ అబద్ధాల కోరులన్నమాటే. అయినా హీరోయిన్లను మేకప్‌కు ముందు, తరువాత చూసేవాళ్లం మేము. మీకున్న మోజులు మాకుంటాయనుకోవడం పొరపాటు అని తేల్చేసారు.


Click it and Unblock the Notifications











