twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ నెల 19న 'రేసుగుర్రం'కు పురస్కారం

    By Srikanya
    |

    హైదరాబాద్:అల్లు అర్జున్‌, శ్రుతి హాసన్‌ జంటగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'రేసుగుర్రం' చిత్రం బి.నాగిరెడ్డి పురస్కారానికి ఎంపికైంది. ఇంటిల్లిపాదికీ వినోదాలు పంచిన ఓ చిత్రానికి ఏటా విజయ మెడికల్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బి.నాగిరెడ్డి స్మారక పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. 2014కి 'రేసుగుర్రం' చిత్రాన్ని ఎంపిక చేసినట్టు విజయ మెడికల్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ధర్మకర్త బి.వెంకటరామిరెడ్డి మీడియాకు తెలిపారు.

    'రేసుగుర్రం' చిత్రాన్ని నిర్మించిన నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), డా.వెంకటేశ్వరరావులకు ఈ నెల 19న హైదరాబాద్‌లో పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్టు బి.వెంకటరామిరెడ్డి చెప్పారు. ప్రముఖ నటులు కృష్ణ, విజయనిర్మలతో పాటు గాయని రావు బాలసరస్వతి దేవి, ఐపీఎస్‌ అధికారి ఎ.కె.ఖాన్‌ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని వెంకటరామిరెడ్డి తెలిపారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఈ చిత్రం కథేమిటంటే...

    Nagireddy award to Race Gurram Movie

    అన్నదమ్ములైన రామ్(శ్యామ్),లక్ష్మణ్ అలియాస్ లక్కీ(అల్లు అర్జున్) చిన్నప్పటి నుంచి టామ్ అండ్ జెర్రీ తరహాలో కొట్టుకుంటూ ఎదుగుతారు. పెద్దయ్యాక ఎసిపి గా ఎదిగిన రామ్ ... తన నిజాయితీతో లోకల్ రాజకీయనాయకుడు శివారెడ్డి(రవికిషన్) కి సమస్యగా మారతాడు. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం సంపాదిస్తాడు. దాంతో శివారెడ్డి అతన్ని అడ్డు తప్పించుకోవాలనుకుంటాడు.

    ఆ విషయం తెలిసిన తమ్ముడు లక్కీ ఏం చేసాడు. తన అన్నను ఎలా ఆ కుటిల రాజకీయనాయకుడు నుంచి రక్షించాడు...ఆ క్రమంలో కిల్ బిల్ పాండే(బ్రహ్మానందం) ఎలా ఉపయోగపడ్డాడు అన్నది మిగతా కథ. అలాగే...లక్కీ తొలిచూపులోనే ప్రేమలో పడిన స్పందన(శృతి హాసన్)ని ఎలా దక్కించుకున్నాడు...సినిమాలో సలోని పాత్ర ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

    కిక్' చిత్రం తరహాలో పూర్తిగా కామెడీతో చిత్రాన్ని పరుగెత్తించాలన్న దర్శకుడు నిర్ణయం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఫస్టాఫ్ లో ఫ్యామిలీలను టార్గెట్ చేస్తూ రాసుకున్న సీన్స్ కూడా నీట్ గా ఉన్నాయి. కిల్ బిల్ పాండే గా బ్రహ్మానందం మరోసారి విజృంభించాడు. అలీ.. 'బాలీ ఫ్రమ్ మలేషియా'(కిక్ లో పాత్ర కంటిన్యూషన్) గా బాగా నవ్వించాడు. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ బాగా డిజైన్ చేసారు అదే సినిమాకు కలిసి వచ్చింది.

    కోట శ్రీనివాసరావు, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.

    English summary
    Allu arjun's Race Gurram movie get Nagireddy memorial award.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X