Don't Miss!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గ్యాప్ తర్వాత మళ్ళీ మాజీ ప్రియుడుతో నగ్మా
దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం భోజపురి హీరో రవి కిషన్ తో రిలేషన్ నడిపిన నగ్మా ఆ మధ్య తెగతెంపులు చేసుకుంది. అయితే తెరపై కలిసి కనపడటానికి ఇబ్బంది ఏమిటంటూ ఇద్దరూ కలిసి మరో భోజపురి సినిమా చేస్తున్నారు. డెబ్బైల్లో వచ్చి హిట్టయిన అమితాబ్ డాన్ ని రీమేక్ చేస్తూ ఈ చిత్రం రూపొందుతోంది. ఈ విషయమై అక్కడ మీడియా బాగా హైప్ చేస్తోంది. అక్కడి న్యూస్ లో ఏం వచ్చిందంటే..నగ్మా, రవి గతంలో రొమాంటిక్ గా ఇన్వాల్స్ అయ్యారు. వాళ్ళిద్దరూ పదమూడు భోజపురి చిత్రాలు కలిసి చేసారు. అందులో పదకొండు హిట్స్, అయితే రవి కిషన్...ప్రీతిని పెళ్ళిచేసుకోవటంతో నగ్మాతో బంధంకి పుల్ స్టాప్ పడింది. అందులోనూ బిగ్ బాస్ లో పాల్గొన్నాక తనకు తన భార్యపై ఎంత ప్రేమ ఉందో అర్ధం చేసుకున్నాడు. దాంతో నగ్మాని దూరం పెట్టాడు. ఆమె కూడా అలాగే బిహేవ్ చేసింది. ఇక మెల్లిగా వెలకమ్ టు సజ్జనాపుర్, లక్, రావణ, వెల్ డన్ అబ్బా అంటూ రవి బాలీవుడ్ సినిమాలు చేస్తూండటంతో మళ్ళీ భోజపురి నుంచి ఈ భారీ ఆఫర్ వచ్చింది. దాంతో నగ్మాని తిరిగి రవి సజెస్ట్ చేసారు. పెద్ద ప్రాజెక్టు అని నగ్మా కూడా సంతోషంగా ఒప్పుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే ఈ కాంబినేషన్ కంటిన్యూ అవుతుందని నిర్మాత కామెంట్ చేయటం ఇక్కడ కొసమెరుపు.