చిరంజీవి కుమార్తె పెళ్ళి వేడుకలో నగ్మా డ్యాన్స్!
చిరంజీవి కుమార్తె సుస్మిత వివాహవేడుకల్లో నగ్మా డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఇంకా టాలీవుడ్‌కు చెందిన నటీనటులు వేదిక మీద నృత్యాలు చేసి అతిధులను అలరించనున్నారు. ఒకప్పుడు చిరంజీవి పక్కన హీరోయిన్‌గా నటించి అందాలు ఆరబోసిన నగ్మా లైవ్ డ్యాన్స్ మతిపోగొట్టేలా ఉంటుందనడంలో సందేహం లేదు. అమె తెలుగులో నటించిన ఆఖరి సినిమా ఎన్టీఆర్ అల్లరి రాముడు. ఇప్పుడు అత్త పాత్రలు కూడా కరువు కావడంతో ఆమె భోజ్‌పురి సినిమాలకు పరిమితమైంది. చెల్లెలు జ్యోతిక కెరీర్ అద్భుతంగా ఉండగా నగ్మా నష్ట జాతకం కారణంగా తెరమరుగవుతోంది. శరత్‌కుమార్‌తో ఆమె ప్రేమాయణం విషాదంగా ముగిసింది. గంగూలీతో ఎఫైర్ కూడా ఎదురుతిరిగింది. జీవితంపై విరక్తి చెంది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్యాత్మిక కోర్సులో చేరి, టీచరుగా ఎదిగింది.


Click it and Unblock the Notifications