»   » రొమాంటిక్ ట్రాక్ టు పొలిటికల్ ట్రాక్: చిరుతో ఆమె!(ఫోటో ఫీచర్)

రొమాంటిక్ ట్రాక్ టు పొలిటికల్ ట్రాక్: చిరుతో ఆమె!(ఫోటో ఫీచర్)

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్ : 90వ దశకంలో సౌతిండియా సినీ పరిశ్రమను తన గ్లామర్‌తో ఉక్కిరి బిక్కిరి చేసిన హాట్ అండ్ సెక్సీ భామ నగ్మా అప్పట్లో తెలుగు, తమిళ సినిమా పరిశ్రమల్లో నెం.1 హీరోయిన్‌గా చక్రం తప్పింది. సౌతిండియా టాప్ హీరోలందరితోనూ జత కట్టింది. బాలీవుడ్లో పరిశ్రమకూ తన గ్లామర్ రుచి చూపెట్టింది.

    తెలుగులో నగ్మ నటించిన ప్రేమికుడు, ఘరానా మొగుడు, మేజర్ చంద్రకాంత్, భాషా, అల్లరి అల్లుడు లాంటి చిత్రాలు అప్పట్లో ఘన విజయం సాధించాయి. వయసు పైబడటంతో హరోయిన్ పాత్రల క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేయడానికి సిద్ధమైన నగ్మ చివరి సారిగా తెలుగులో జూ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అల్లరి రాముడు చిత్రంలో కనిపించింది. నగ్మ తెలుగు తెరపై కనిపించక చాలా ఏళ్లు దాటి పోయింది. 2007 తర్వాత ఆమె ఏ బాషలోనూ సినిమాలు చేయలేదు.

    ఆ మధ్య ఆమె తేజా దర్శకత్వంలో ఓ సినిమా ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోందని ప్రచారం జరిగింది....ఆ వార్తలేవీ నిజం కాలేదు. ప్రస్తుతం నగ్మ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ తరుపున ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నుండి పోటీ చేయబోతోంది. ఉత్తర ముంబై నుండి పోటీ చేస్తానని నగ్మ కోరినా....హైకమాండ్ మాత్రం ఆమె రిక్వెస్ట్ తోసి పుచ్చింది. మీరట్ నుండి పోటీ చేయాలని ఆదేశించింది. గతంలో నగ్మతో సినిమాల్లో రొమాన్స్ చేసిన చిరంజీవి కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో సినిమా ట్రాక్‌పై రొమాన్స్ పండించిన ఈ ఇద్దరు, ఇపుడు కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ట్రాక్‌పై రాజకీయాలు పండించే ప్రయత్నం చేస్తున్నారు.

    స్లైడ్ షోలో నగ్మకు సంబంధించిన ఫోటోలు....

    తెలుగులో నగ్మ నటించిన సినిమాలు

    తెలుగులో నగ్మ నటించిన సినిమాలు

    తెలుగులో నగ్మ పెద్దింటి అల్లుడు, కిల్లర్, ఘరానా మొగుడు, అశ్వమేధం, అల్లరి అల్లుడు, మేజర్ చంద్రకాంత్, సూర్య పుత్రులు, మౌనం, అల్లరి రాముడు, కొండపల్లి రాజా, ముగ్గురు మొనగాళ్లు, రాజసింహం, రెండిళ్ల పూజారి, సరదా బుల్లోడు, సూపర్ పోలీస్, వారసుడు, గ్యాంగ్ మాస్టర్ చిత్రాల్లో నటించింది.

    నగ్మకు పేరు తెచ్చిన చిత్రాలు

    నగ్మకు పేరు తెచ్చిన చిత్రాలు

    నగ్మ తెలుగులో నటించిన తొలి చిత్రం కిల్లర్. 1990లో హిందీలో బాఘి చిత్రంలో ఎంట్రీ ఇచ్చినా ఆమె తొలి హిట్ రుచి చూసింది మాత్రం 1991లో వచ్చిన తెలుగు సినిమా ‘కిల్లర్'తోనే. ఆ తర్వాత ఆమెకు ఘరానా మొగుడు, అల్లరి అల్లుడు, మేజర్ చంద్రకాంత్ లాంటి చిత్రాలు మంచి పేరు తెచ్చాయి.

    నటించిన సినిమాలు 70 పైనే

    నటించిన సినిమాలు 70 పైనే

    నగ్న తెలుగు, తమిళం, హిందీ భాషల్లా బాగా పాపులర్ అయింది. వీటితో పాటు మరాఠి, భోజ్‌పురి, కన్నడ, మళయాలం భాషల్లోనూ నటించింది. అన్నీ భాషల్లో కలిసి నగ్మ ఇప్పటి వరకు దాదాపు 70 చిత్రాల్లో నటించింది.

    నగ్మ అసలు పేరు

    నగ్మ అసలు పేరు

    నగ్మ అసలు పేరు నందితా మోరార్జీ. అయితే ఆమె స్క్రీన్ నేమ్ మాత్రం నగ్మ. ఆ పేరుతోనే ఆమె పాపులర్ అయింది. ఆమె పేరులోని సెక్సీ తనం కూడా చాలా మంది ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసింది. ప్రస్తుతం ఆమె వయసు 38 సంవత్సరాలు.

    పుట్టింది ముంబైలో

    పుట్టింది ముంబైలో

    నగ్మ డిసెంబర్ 25, 1974లో ముంబైలో జన్మించింది. ముస్లిం మధర్, హిందూ ఫాదర్‌కు జన్మించింది. ఆమె అసలు తండ్రి అరవింద్ ప్రతాప్ సింగ్ మోరార్జీ. నగ్మ పూర్వీకులు జైసల్మీర్ కు చెందిన రాజకుటుంబీకులు. తర్వాత వారు గుజరాత్, పోరుబందర్, ముంబైలలో స్థిరపడ్డారు.

    సినీ రంగంలోకి ఎలా అంటే..?

    సినీ రంగంలోకి ఎలా అంటే..?

    నమ్మ సినీ రంగంలోకి రావడానికి ఆమె సవతి తండ్రే కారణం. నగ్మ తల్లి సీమ 1973లో మోరార్జీ నుంచి విడిపోయింది. ఆ తర్వాత 1974లో నగ్మ జన్మించింది. ఆతర్వాత 1975లో నగ్మ తల్లి సీమ సినీ నిర్మాత అయిన చందర్‌ను పెళ్లాడింది. ఇలా సినిమా వాతావరణంలో పెరగడంతో నగ్మ అడుగులు సినీమారంగం వైపు పడ్డాయి.

    English summary
    Actress Nagma is getting ready to contest the elections on a Congress party ticket from Meerut in Uttar Pradesh.
    దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more