సినిమాల వల్ల కాకుండా ఇతరేతర కారణాల వల్ల ఎప్పుడూ వార్తల్లో ఉండే నటి నగ్మా చెబుతున్న మాటలు వింటే ఆశ్చర్యం కలుగక మానదు. తనకింకా పెళ్లి చేసుకునే వయసు రాలేదని ఆమె చెబుతోంది. తాను సాధించాల్సిన లక్ష్యాలు, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, ఆ తర్వాతే పెళ్లి అని ఆమె అంటోంది. నగ్మా చెల్లె జ్యోతిక పెళ్లి చేసుకుని ఓ కూతురుని కని హాయిగా సంసారంలో ఇమిడిపోయింది. నగ్మాకు మాత్రం ఇంకా ఆ వయసు రాలేదట. నటనలో తన ప్రతిభను కనబరిచి పెళ్లి చేసుకున్న జ్యోతిక ఇప్పుడు రీ ఎంట్రీకి సిద్ధపడుతోంది. నగ్మా గంగూలీతో ప్రేమాయణం నడిపి కొంత కాలం వార్తలకెక్కిన విషయం తెలిసిందే. మరో సినిమా నటుడితోనూ ఆమె ప్రేమ కథ నడిపినట్లు ప్రచారం సాగింది.