అల్లు అర్జున్ తల్లి పాత్రలో ఒకప్పటి గ్లామరస్ హీరోయిన్?
ఒకప్పుడు తన గ్లామర్‌తో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది నటి నగ్మా. తెలుగులో దాదాపు అగ్రహీరోలందరితో ఆమె నటించారు. హీరోయిన్‌గా తన కెరీర్ ముగిసిన తర్వాత సినిమాలకు దూరమైన ఆమె త్వరలో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తర్వాతి సినిమాలో నగ్మతో కీలకమైన పాత్ర చేయించబోతున్నారట.
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ మూవీ త్వరలో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసందే. గీతా ఆర్ట్స్, హారిక హాసిన క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ పొడక్షన్ దశలో ఉంది. ముఖ్య పాత్రల ఎంపిక జరుగుతోంది.

అల్లు అర్జున్ తల్లి పాత్రలో నగ్మ?
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... అల్లు అర్జున్ తల్లి పాత్రలో నగ్మ నటించబోతున్నట్లు సమాచారం. సినిమాలో ఆ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని, రోటీన్ యాక్టర్లను కాకుండా డిఫరెంటుగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే త్రివిక్రమ్ ఈ ఆలోచన చేశారట.

కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్‌గా ఉన్న నగ్మ
ప్రస్తుతం నగ్మ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్‌గా ఉన్నారు. త్రివిక్రమ్ కథ చెప్పగానే ఆమె చేయడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆమె అగ్రిమెంటు మీద సైన్ చేయాల్సి ఉంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు హడావుడి మొదలు కాబోతున్న నేపథ్యంలో నగ్మ డేట్స్ ఎప్పుడు ఇస్తారు? అనేది ఇంకా ఫైనల్ కాలేదు.

పూజా హెగ్డే
బన్నీ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే ఎంపికైనట్లు తెలుస్తోంది. ఆమె అగ్రిమెంట్ మీద సైన్ చేసిన తర్వాత అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. గతంలో బన్నీ-పూజా హెగ్డే డిజెలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.

షూటింగ్ ఎప్పుడు?
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం షూటింగ్ మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్ స్రిప్టుకు ఫినిషిట్ టచ్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక హాసిన క్రియేషన్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించబోతున్నారు.


Click it and Unblock the Notifications











