twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాజీ హీరోయిన్ నగ్మా తో కాంగ్రేస్ లో విభేదాలు?

    By Srikanya
    |

    ముంబై: తెలుగులో ఘరానా మొగుడు వంటి చిత్రాల్లో హాట్ హాట్ గా అదరకొట్టిన నగ్మాను ఓ తరం వారు మర్చిపోరు. ప్రస్తుతం ఆమె సినిమాలనుంచి రాజకీయాల వైపు ప్రయాణం పెట్టుకుంది. నగ్మా పేరు కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిత్వానికి ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమెను రాజ్యసభ ఎన్నికల బరిలో దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే నగ్మాను రాజ్యసభకు పంపే విషయంలో కాంగ్రెస్‌లో విభేదాలు పొడసూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    నగ్మా అభ్యర్థిత్వం కోసం ఢిల్లీ స్థాయిలో కొందరు నేతలు పావులు కదుపుతున్నారు. ఈమేరకు పార్టీ అధిష్ఠానానికి ఆమె పేరును సిఫార్సు చేసినట్లు తెలియవచ్చింది. మహారాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మోహన్‌ ప్రకాశ్‌ కూడా నగ్మా అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నట్లు సమాచారం. కేంద్ర విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ మృతి అనంతరం ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి జనవరి 12న ఎన్నికలు నిర్వహించనున్న సంగతి తెల్సిందే. దీంతో విలాసరావ్‌ స్థానాన్ని భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌ సన్నిహితుడైన కాంగ్రెస్‌ నేత రోహిదాస్‌ పాటిల్‌ పేరును తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా నగ్మా పేరును సిఫార్సు చేయడంతో కాంగ్రెస్‌ సమీకరణాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    ఖాళీగా ఉన్న ఒక్క స్థానం కోసం రాష్ట్రం నుంచి రోహిదాస్‌ పాటిల్‌తో పాటు విదర్భలోని కాంగ్రెస్‌ నేత నరేశ్‌ పుగాలియా, మాజీ మంత్రి అనీస్‌ అహ్మద్‌లు ప్రయత్నిస్తున్నారు. నగ్మాది గుజరాత్‌ కాబట్టి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ మద్దతు లభించే అవకాశాలున్నాయి. నగ్మాకు అభ్యర్థిత్వం కట్టబెడితే గుజరాత్‌, మహారాష్ట్రలోని ముస్లిం సమాజంలోని మహిళకు కాంగ్రెస్‌ ప్రాధాన్యమిచ్చినట్లు సందేశం ప్రజల్లోకి వెళ్తుందని ఓ సీనియర్‌ మంత్రి వాదిస్తున్నారు.

    తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో నగ్మా చరిష్మా ఉన్నందున దక్షిణాది ఓటర్ల మద్దతు ఉండొచ్చని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలియవచ్చింది.. నగ్మాను రాజ్యసభకు పంపే విషయంలో కాంగ్రెస్‌లో విభేదాలు పొడసూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ నేతలు నగ్మా అభ్యర్థిత్వాన్ని సమర్థించక పొవచ్చని తెలిస్తే అధిష్ఠానం వెనకడుగు వేయవచ్చని ఓ సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు. గతంలోనే రాజకీయ ప్రవేశానికి నగ్మా ప్రయత్నించింది. ఇందులో భాగంగానే 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థిత్వం లభిస్తుందని జోరుగా వూహాగానాలు సాగాయి. లోక్‌సభ ఎన్నికల్లో నెరవేరని కలను రాజ్యసభ ఎన్నిక ద్వారా సాకారం చేసుకోవడానికి నగ్మా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కూడా అధిష్ఠానం దృష్టికి ఆమె పేరున సిఫార్సు చేసినట్లు సమాచారం.

    2009 ఎన్నికల్లో ముంబై లేదా ఉత్తరాది రాష్ట్రాల నుంచి లోక్‌సభ టిక్కెట్‌ కోసం నగ్మా విఫలయత్నం చేశారు. అప్పట్లో టిక్కెట్‌ నిరాకరించినప్పటికీ ముంబై, హిందీ - భోజ్‌పురి ప్రాంతాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. నగ్మా అంకితభావంతో పనిచేస్తున్నందున టిక్కెట్‌ డిమాండ్‌ చేసే హక్కుందని ఠాక్రే వ్యాఖ్యానించారు. విలాస్‌రావ్‌ సతీమణి వైశాలిని బరిలో దింపాలని కొందరు వాదిస్తున్నారు. దీనిపై దేశ్‌ముఖ్‌ కుటుంబం ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. రాజ్యసభ సీటును ఆశిస్తున్న ఇతరుల్లో రజనీ పాటిల్‌, మాజీ మంత్రి రోహిదాస్‌ పాటిల్‌, మాజీ ఎమ్మెల్యే ముజఫర్‌ హుస్సేన్‌, శివసేన నుంచి కాంగ్రెస్‌లో చేరిన సుబోధ్‌ మొహితే ఉన్నారు. పోటీ పై శివసేన- భాజపా ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు.

    English summary
    According to Congress sources, Nagma, 38, had earlier asked the Congress high command for a Lok Sabha ticket from Mumbai and northern states in 2009. Though denied a ticket then, she campaigned for party candidates in Mumbai and Hindi-Bhojpuri heartland. State Congress president Manikrao Thakre said that the actor was a dedicated party worker and it was her right to demand a ticket.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X