»   » నగ్నసత్యం: హీరోయిన్‌తో రవిబాబు శృంగార కేళి (ఫోటోలు)

నగ్నసత్యం: హీరోయిన్‌తో రవిబాబు శృంగార కేళి (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓ స్త్రీ ఉదంతాన్ని కతాంశంగా తీసుకుని సంచలన పాకిస్థానీ హీరోయిన్ వీణా మాలిక్ ప్రధాన పాత్రలో అనురాధా ఫిలింస్ పతాకంపై కూరపాటి రామారావు దర్శకత్వంలో చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన 'నగ్న సత్యం' చిత్రం షూటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. మరి ఆ స్త్రీ ఎవరనేది? సినిమా విడుదలైతే‌గానీ తెలిసే అవకాశం లేదు.

తాజాగా ఈచిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి. సెన్సార్ వారు సినిమా చూసి ఇలాంటి సినిమా ప్రస్తుత సమాజానికి అవసరం అని చెప్పి అభినందించారు. మా సినిమాకు 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారని నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు చెప్పారు.

తాజాగా విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్ సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి. వీణా మాలిక్‌తో జతకట్టిన రవిబాబు రేంజిలో రెచ్చిపోయిన శృంగార సీన్లలో నటించడం గమనార్హం. స్లైడ్ షోలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు, ఫోటోలు....

సినిమాలో అనేక నగ్న సత్యాలు

సినిమాలో అనేక నగ్న సత్యాలు

ఒక మంచి కథాంశంతో మేము సమాజానికి ఇలాంటి విషయాలను తెలియాలి అనే దృక్ఫథంతో ఈ సినిమాను రూపొందించాము. మా ప్రయత్నానికి మొదటి విజయంగా సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమా పేరుకు తగ్గట్టు సమాజంలో జరుగుతున్న అనేక నగ్న సత్యాలు ఇందులో చూపించామని నిర్మాత తెలిపారు.

వీణా మాలిక్

వీణా మాలిక్

హీరోయిన్ వీణా మిలిక్ తెలుగు రాక పోయినా సన్నివేశాన్ని అర్థం చేసుకుని నటించింది. ఈ చిత్ర దర్శకుడు కూరపాటి రామరావు సినిమాను చక్కగా రూపొందించాడని, తమ బేనర్‌కు, దర్శకుడికి మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం వ్యక్తం చేసారు నిర్మాత.

రవిబాబు

రవిబాబు

ఈ చిత్రంలో వీణా మాలిక్‌కు జోడీగా దర్శకుడు, నటుడు అయిన రవిబాబు నటించారు. మిగిలిన పాత్రల్లో చలపదిరావు, జాకీ, విజయ్, ఆర్.కె. తదితరులు నటించారు. సినిమాకు సంగీతం : శంభుప్రసాద్, నిర్మాత: చదలవాడ శ్రీనివాసరావు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కూరపాటి రామారావు.

సినిమా గురించి వీణా మాలిక్

సినిమా గురించి వీణా మాలిక్

ఇది చాలా టఫ్ సీన్ అని, పోలీసులు నన్ను జైల్లోకి లాక్కెళ్లండం మాటల్లో చెప్పలేకపోతున్నానని, షూటింగులో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నానని వీణా మాలిక్ గతంలో షూటింగ్ సందర్బంగా తెలిపింది.

వీణా మాలిక్ ఇపుడు ఎక్కడ?

వీణా మాలిక్ ఇపుడు ఎక్కడ?

ఇటీవల అసద్ బషీర్ ఖాన్ అనే వ్యక్తిని పెళ్లాడిన వీణా మాలిక్ ప్రస్తుతం బాలీవుడ్ తన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె తన భర్తతో కలిసి విదేశాల్లో గడుపుతోంది.

రొమాంటిక్ రవిబాబు

రొమాంటిక్ రవిబాబు

ఇప్పటి వివిధ సినిమాల్లో రకరకాల పాత్రల్లో నటించిన రవిబాబు తొలిసారిగా ఈ చిత్రంలో పూర్తి రొమాంటిక్ రోల్స్ పోషిస్తున్నారు.

శృంగార సీన్లు

శృంగార సీన్లు

గతంలో ఏ సినిమాలోనూ లేని విధంగా రవి బాబు ఈ చిత్రంలో శృంగార సీన్లలో రెచ్చిపోయిన నటించడం హాట్ టాపిక్‌గా మారింది.

ఇకపై కూడా....

ఇకపై కూడా....

రవిబాబు చేసిన ఈ సినిమాకు ఇతర ఫిల్మ్ మేకర్స్ నుండి మంచి స్పందన వస్తోంది. ఇకపై ఆయనతో శృంగార సీన్లు చేయించేందుకు పలువురు ఫిల్మ్ మేకర్స్ యోచిస్తున్నట్లు సమాచారం.

నగ్నసత్యం

నగ్నసత్యం

పాకిస్థానీ హీరోయిన్ వీణా మాలిక్ ప్రధాన పాత్రలో అనురాధా ఫిలింస్ పతాకంపై కూరపాటి రామారావు దర్శకత్వంలో చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన చిత్రం ‘నగ్న సత్యం'.

ఆమె ఎవరు?

ఆమె ఎవరు?

మన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓ స్త్రీ ఉదంతాన్ని కతాంశంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని నిర్మాతలు తెలిపారు. మరి ఆమె ఎవరు? అనేది చర్చనీయాంశం అయింది.

English summary

 Nagna Satyam film censor completed, get A Certificate. Pakistani girl Veena Malik has played the lead role in the film ‘Nagna Satyam’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu