హీరో నాని నాతో అలా బిహేవ్ చేశాడు: ఆర్జీవీ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే టాలీవుడ్‌లోకి వచ్చినా.. అసాధారణ నటనతో ప్రేక్షకులను ఫిదా చేసేసి నేచురల్ స్టార్ అనే పేరును సొంతం చేసుకున్నాడు హీరో నాని. ప్రతి చిత్రంలో తనదైన యాక్టింగ్‌తో వన్ మ్యాన్ షో చేసే అతడు.. ఎన్నో హిట్లను కూడా ఖాతాలో వేసుకుని తన రేంజ్‌ను పెంచుకుంటున్నాడు. ఇలా కెరీర్ పరంగా ఈ టాలెంటెడ్ హీరో మరింత ప్రభావాన్ని చూపిస్తూ ముందుకు సాగుతోన్నాడు. ఈ నేపథ్యంలో నాని గురించి ఆర్జీవీ కాంపౌండ్‌కు చెందిన తెలుగు హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అవేంటో తెలుసుకుందాం పదండి!
వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో
నేచురల్ యాక్టింగ్‌తో ఫిదా చేస్తోన్న నాని తనదైన సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. ఆ మధ్య కొన్ని ఫ్లాపులతో ఇబ్బందులు పడినా.. 'దసరా' అనే సినిమాతో పాన్ ఇండియా రేంజ్ సక్సెస్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ వెంటనే 'హాయ్ నాన్న' అనే సినిమాతో వచ్చి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇలా ఈ మధ్యన వరుస హిట్లను అందుకుని ఫామ్‌లోకి వచ్చాడు.

సరిపోదా శనివారం అంటూ
నాని ప్రస్తుతం 'సరిపోదా శనివారం' అనే సినిమాను చేశాడు. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. అలాగే ఎస్‌జే సూర్య విలన్ పాత్రను చేశాడు. ఈ సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా
నేచురల్ స్టార్ నాని నటించిన 'సరిపోదా శనివారం' మూవీ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసేసింది. ఇందులో భాగంగానే నాని ఇప్పుడు ప్రమోషన్స్ కోసం ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. దీంతో ఇండియా వ్యాప్తంగా 'సరిపోదా శనివారం' సినిమాకు సంబంధించిన హడావిడే కనిపిస్తోంది.

నానిపై శ్రీ రాపాక కామెంట్
'సరిపోదా శనివారం' మూవీ రిలీజ్ సందర్భంగా నాని పేరు సోషల్ మీడియాలో యమా ట్రెండ్ అవుతోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తెలుగు హీరోయిన్ శ్రీ రాపాక (నగ్నం సినిమా ఫేం).. హీరో నాని ప్రవర్తన గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇది హాట్ టాపిక్ అవుతోంది.
ఏమీ లేనప్పుడే కలిశాను
తాజా ఇంటర్వ్యూలో శ్రీ రాపాక మాట్లాడుతూ.. 'కొంత మంది అసిస్టెంట్ డైరెక్టర్లుగా, సినిమా ట్రయల్స్ చేస్తున్న సమయంలోనే నేను వాళ్లను కలిశాను. అప్పుడు నాతో చాలా బాగా ఉన్న వాళ్లంతా.. ఇప్పుడు మాత్రం నేను ఎవరో తెలియనట్లుగా బిహేవ్ చేస్తున్నారు. అందులో హీరో తనీష్, నందూ (గీతా మాధురి భర్త) మాత్రం ఇప్పటికీ నాతో బానే ఉంటారు' అని చెప్పుకొచ్చింది.

నాని మాత్రం మారాడు
శ్రీ రాపాక కంటిన్యూ చేస్తూ.. 'ఇప్పుడు చెప్పిన వాళ్లలో ఒక్కరు మాత్రం బాగా మారిపోయాడు. ఆయన ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక స్టార్ అయ్యాడు. ఆయనే నేచురల్ స్టార్. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసినప్పటి నుంచి అతడు నాకు తెలుసు. కానీ, ఇప్పుడు రేంజ్ మారడంతో నేను పరిచయం లేనట్లుగానే బిహేవ్ చేస్తుంటాడు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.


Click it and Unblock the Notifications











