నాగార్జున 'కేడీ' చిత్రం ఆడియో ఎప్పుడంటే...
నాగార్జున తాజా చిత్రం 'కేడీ' ఆడియో పంక్షన్ ని క్రిస్మస్ పండుగ రోజు(డిసెంబర్ 25)న హైదరాబాద్ లో ప్లాన్ చేసారు.అయితే ఎక్కడ చేస్తున్నారు ఏమిటన్నది పూర్తిగా ఫైనలైజ్ కాలేదు.ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో లాస్ట్ షెడ్యూల్ జరుగుతోంది. ఈ విషయమై నిర్మాత శివ ప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..జనవరి రెండవ వారంలో సినిమాని రిలీజ్ చేస్తున్నాం. ఆడియో డిసెంబర్ 25 కి మార్కెట్ లో ఉండేలా చూస్తున్నాం. ఈ చిత్రం ద్వారా కిరణ్ అనే నూతన దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఇందులో నాగ్ సరసన మమతా మోహన్ దాస్ హీరోయిన్ గా నటిస్తోంది. అమెరికా అమ్మాయి లిండా ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. 'స్లమ్ డాగ్ మిలియనీర్" ఫేం అంకుర్ విలన్ గా చేస్తున్నారు. నిర్మల్ పాండే, లగానే పేం అఖిలేంద్ర మిశ్రా, 'డాన్" విలన్ కెల్లీడార్జ్ క్యారెక్టర్స్ హైలెట్ అవుతాయి.
నాగార్జున కేడీ మమతా మోహన్ దాస్ లిండా అంకుర్ డాన్ నిర్మల్ పాండే kedi nagarjuna mamata mohan das linda ankur don nirmal pande


Click it and Unblock the Notifications