నాగార్జున 'పయనం'
'ఆకాశమంత' చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు రాధా మోహన్. ప్రస్తుతం నాగార్జున కథానాయకుడిగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీనికి 'పయనం' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రం ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందబోతోందని సమాచారం.
తన తనయుడు నాగచైతన్యను కథానాయకుడిగా నిలబెట్టే ప్రయత్నాల్లో ఇంత కాలం సినిమాలకు దూరంగా వున్న నాగార్జున 'కింగ్' తర్వాత చెయ్యబోతున్న చిత్రం ఇదే. అంతే కాకుండా చాలా కాలం తర్వాత నాగార్జున ఈ చిత్రం ద్వారా తమిళ తంబిలకు దర్శనమివ్వబోతున్నారు. ఇంకా కథానాయిక ఖరారు కాని ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
nagarjuna payanam radha mohan king trisha mamatha mohandas aakasamantha prakash raj naga chaitanya josh నాగార్జున పయనం రాధా మోహన్ కింగ్ నాగచైతన్య జోష్ త్రష ప్రకాష్ రాజ్


Click it and Unblock the Notifications