Nakedలో హాట్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఏ జిల్లా.. రెమ్యునరేషన్ ఎంతంటే?
కరోనావైరస్ లాక్‌డౌన్ సమయంలో సినీ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతే దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం కోట్లు సంపాదించే పనిలో పడ్డారు. లాక్‌డౌన్‌లో సినిమాల నిర్మాణం చేసి అందర్నీ షాక్ గురిచేశారు. జీఎస్టీ ఫేం మియా మాల్కోవాతో క్లైమాక్స్ చిత్రాన్ని రూపొందించారు. ఆ తర్వాత కిడ్నాపింగ్ ఆఫ్ కత్రినా కైఫ్, NNN అనే చిత్రాలను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే పెద్దలకు మాత్రమే కంటెంట్‌తో వస్తున్న నెకెడ్, నంగా, నగ్నం చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో శృంగార పాత్రలో నటించిన నటి ఎవరు? ఇంతకు ముందు ఏం చేశారు? ఎంత రెమ్యునరేషన్ తీసుకొన్నారనే విషయాలు ఇప్పుడు ప్రశ్నలుగా మారాయి.. ఇంతకు ఆమె ఎవరంటే..

జూన్ 27వ రాత్రి 9 గంటలకు
నెకెడ్, నంగా, నగ్నం (NNN) చిత్రం ఆర్జీవీ వరల్డ్ అనే యాప్‌లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. 22 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం జూన్ 27 శనివారం రాత్రి 9 గంటలకు రిలీజ్ కానున్నది. తన సినిమాల రిలీజ్ కోసం ఆర్జీవి http://RGVWorld.in/ShreyasET అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

టికెట్ ధర ఎంతంటే
నెకెడ్, నంగా, నగ్నం (NNN) చిత్రానికి సంబంధించిన టికెట్ రేటును ప్రకటించి ప్రేక్షకులకు భారీ షాక్‌ను ఆర్జీవి ఇచ్చారు. క్లైమాక్స్ చిత్రానికి రూ.100 టికెట్ ధర పెడితే.. NNN చిత్రానికి మాత్రం రూ.200 టికెట్ ధరగా నిర్ణయించారు. ఫారిన్ హీరోయిన్‌కు ధర తక్కువ, ఇండియన్ హీరోయిన్ అందాలకు రేటు ఎక్కువ అంటూ టికెట్ ధరను వర్మ సమర్ధించుకొన్నారు.

NNN హీరోయిన్ పేరు
కాగా, ప్రేక్షకలోకం ఆసక్తిగా చూస్తున్న నెకెడ్, నంగా, నగ్నం (NNN) చిత్రంలో నటించిన హీరోయిన్ పేరు ట్విట్టర్, ఇన్స్‌టాగ్రామ్ ప్రకారం స్వీటీ. ట్విట్టర్‌లో @sweetyNNN గా, ఇన్స్‌టాగ్రామ్‌లో sweety.nnnగా ఐడీలు క్రియేట్ అయ్యాయి. ఈ విషయానలు ఇటీవల దర్శకుడు రాంగోపాల్ వర్మ తన అధికారిక ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని
నెకెడ్, నంగా, నగ్నం (NNN) కోసం చిత్రీకరించిన ఫోటోషూట్ సందర్భంగా లాక్‌డౌన్ నిబంధనలు పాటించాను. సోషల్ డిస్టెన్స్ పాటించానని నా ఫాలోవర్స్ మీద ఒట్టేసి చెబుతున్నాను. నా NNN చిత్రంలో నటిస్తున్న అమ్మాయి పేరు స్వీటీ. ఆమె పశ్చిమ గోదావరి జిల్లాలోని దేవరపల్లి గ్రామానికి చెందిన వారు అని చెప్పారు. అయితే ఈ సినిమా కోసం ఆమెకు తక్కువగానే రెమ్యునరేషన్ ఇచ్చారని, లక్షకు మించి ఇవ్వలేదనే విషయం సినీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.
Recommended Video

సహజ నటిగా స్వీటీ
నెకెడ్ మూవీ హీరోయిన్ స్వీటీ గురించి రాంగోపాల్ వర్మ చెబుతూ.. స్వతహాగా, సహజసిద్దమైన నటనా ప్రతిభ స్వీటీ సొంతం అన్నారు. పాత్ర డిమాండ్ మేరకు ఆమె ఆ రోల్‌లొకి ఒదిగిపోయారు. ఆమె హావభావాలు, శృంగారభరితమైన సన్నివేశాల్లో జీవించారు. పాత్రకు ఏ రేంజ్‌లో న్యాయం చేయాలో ఆ రేంజ్‌లో చేశారు అని వర్మ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాస్త ఆగితే స్వీటీ పనితరం ఏమిటో ప్రేక్షకులకు బోధపడటం ఖాయం.


Click it and Unblock the Notifications











