సూర్య హీరోగా ద్విబాషా చిత్రం చేయనున్న మెగా నిర్మాత
హైదరాబాద్: ఇటీవల విడుదలైన 'రేసు గుర్రం' చిత్రంతో భారీ విజయం అందుకున్న ప్రముఖ తెలుగు నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) మరో భారీ ప్రాజెక్టు చేయడానికి రెడీ అవుతున్నారు. సౌతిండియా స్టార్ హీరోల్లో ఒకరైన సూర్యతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.
ఈ విషయమై ఆయన మాట్లాడుతూ...'సూర్యతో ద్విబాషా చిత్రం చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతం సూర్య, మురుగదాస్ వేర్వేరు ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటం వల్ల వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నాం. ప్రాజెక్టు ఫైనలైజ్ అయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాను' అని తెలిపారు.

గతంలో సూర్య, మురుగదాస్ కాంబినేషన్లో 'గజిని', 'సెవెన్త్ సెన్స్' అనే రెండు సినిమాలు వచ్చాయి. 'గజినీ' చిత్రం భారీ విజయం సాధించగా...'సెవెన్త్ సెన్స్' చిత్రం నిరాశ పరిచింది. తాజాగా ఈ ఇద్దరు కలిసి మూడో సినిమా చేస్తుండటం చర్చనీయాంశం అయింది.
'రేసు గుర్రం' చిత్రం గురించి బుజ్జి మాట్లాడుతూ....సినిమా విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. సురేందర్ రెడ్డితో త్వరలో మరో సినిమా చేస్తాను. ప్రస్తుతానికి స్క్రిప్టులు ఏవీ రెడీగా లేవు. స్క్రిప్టు ఓకే అయితే త్వరలోనే సురేందర్ రెడ్డితో సినిమా చేస్తాను అని తెలిపారు.


Click it and Unblock the Notifications











