బాలయ్యతో అప్పుడు మిస్ అయ్యా ఇప్పుడు సక్సెస్ అయింది...!?
టాలీవుడ్ లో 'బిల్లా" తో తన కొత్త ఇన్నింగ్స్ ప్రారంభమైందనీ, పెద్ద ప్రాజెక్టుల్లో అవకాశాలు వస్తున్నాయనీ, 'సింహా" సక్సెస్ తో తన రేంజ్ మరింతగా పెరిగిపోయిందని నమిత ఉబ్బి తబ్బిబ్బయిపోతోంది. 2003లోనే బాలకృష్ణతో నటించాల్సి వున్నా, అప్పట్లో టాటీవుడ్ లో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే నటించలేకపోయాననీ, ఇన్నాళ్ళకు మళ్ళీ బాలయ్యతో నటించే అవకాశం రావడం, హిట్ కొట్టడం చాలా ఆనందాన్నిస్తోందని 'సింహా" అర్థ శతదినోత్సవ వేడుకలో నమిత చెప్పుకొచ్చింది.
అన్నట్టు, 'సింహా" సినిమా సమయంలో, కాస్త ఒళ్ళు తగ్గించు..అంటూ బాలకష్ణ ఇచ్చిన సలహా పాటిస్తున్నానంటూ నమిత ఆ మధ్య బోల్డన్ని కబుర్లు చెప్పినా, నమిత భారీతనంలో ఏమాత్రం ఛేంజ్ వచ్చినట్లు కన్సించడంలేదు. అదే భారీ కాయంతో అవే పొట్టి బట్టలతో నమిత 'సింహా" శతదినోత్సవ వేడుకల్లో దర్శనమిచ్చింది. చూడ్డానికి ఎంత ఎబ్బెట్టుగా జనానికి అనిపించినా, నమిత మాత్రం, తన భారీ అందాల్ని పొట్టిబట్టల్లో ప్రదర్శించడానికి బాగా అలవాటైనోయింది మరి..!


Click it and Unblock the Notifications











