కోరిక తట్టుకోలేకే నమిత..

ఎందుకంటే అందులో ఆమె పోలీస్ ఆఫిసర్ గా నటిస్తోంది. దాంతో నమిత ఆ పాత్ర లో లీనమై నిజంగానే పోలీస్ ఆఫిసర్ లా స్లిమ్ గా అవదామని ప్రయత్నించింది. దానికోసం గత నెల రోజులుగా తిండి తగ్గించి కొంచెం(మరీ ఎక్కువ కాదు) స్లిమ్ గా తయారయ్యింది. అయితే ఆహారంలో ఏం తగ్గించిందీ ఈ బొద్దుగుమ్మ అంటే నాన్ వెజ్ మాత్రమే. కానీ ఇప్పుడామె దృష్టి మొత్తం నాన్ వెజ్ పైనే ఉందిట.
తాను ఏ కోరికనైనా ఆపుకుంటుంది కానీ ఈ ముక్క కొరక కుండా ఉండలేక పోతున్నానని చెప్తోంది. ఇక ఈ కోరిక ఆపుకోలేక సన్నిహితులు సూచన మేరకు వారానికి ఒక్కసారి మాత్రమే నాన్ విజ్ ముట్టుకుంటానని చెబుతుంది. ఎవరు తినవద్దన్నారు తింటే వద్దన్నిది ఎవరు అన్నారు అంతా నీఇష్టం ఏదైనా చెయ్ అని యూనిట్ సభ్యులు కామెంట్ చేస్తున్నారు. ఒక పవర్ ఫుల్ పోలీసు కథాంశంతో ఈ చిత్ర కథ ఉంటుందనీ, విజయశాంతితో ఈ కథను తెరకెక్కిద్దామని తొలుత అనుకున్నప్పటికీ చివరకు నమితను ఎంపిక చేసినట్టు నిర్మాత తెలిపారు. దేశద్రోహి చిత్రంలో శ్రీహరి కీలకపాత్ర పోషించనున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











